ఇరాన్‌తో అమెరికా డీల్.. మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jun 19 , 2026 | 07:16 AM
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయొతొల్లా మొజ్తాబా ఖమేనీ గురువారం ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన కామెంట్లు చేశారు.
టెహ్రాన్, జూన్ 19: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య బుధవారం శాంతి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఎంఓయూపై గ్యారెంటర్‌గా సంతకం చేశారు. బుధవారం నుంచే శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం 60 రోజులు అమల్లో ఉంటుంది. ఈ లోపు శాశ్వత సంధి కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతాయి.
మొజ్తాబా షాకింగ్ కామెంట్లు..
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయొతొల్లా మొజ్తాబా ఖమేనీ గురువారం ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన కామెంట్లు చేశారు. బుధవారం ఓ సుదీర్ఘ లేఖను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ లేఖలో ఏముందంటే.. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగడానికి కారణం ట్రంపేనని మొజ్తాబా ఖమేనీ అన్నారు.
ట్రంప్ తీవ్ర నిరాశతో అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి శాంతి ఒప్పందం జరిగేలా చేశారని చెప్పారు. తాను ఒప్పందం విషయంలో భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. అమెరికా గనుక మితిమీరిన డిమాండ్లు చేయాలని చూస్తే.. తాము వాటికి లొంగబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య డీల్ జరిగిన మరుసటి రోజే మొజ్తాబా ఖమేనీ ఈ కామెంట్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
ఈ రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..