సూర్యాపేట సూపర్ మార్కెట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఆస్తి నష్టం
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:53 PM
దసరా పండుగ వేళ సూర్యాపేట పట్టణంలో భారీ పేలుడు కలకలం రేపింది. స్థానిక పీఎస్సార్ సెంటర్‌లోని శ్రీసాయి సూపర్ మార్కెట్‌లో గ్యాస్ లీక్ కారణంగా సిలిండర్ పేలినట్లు తెలుస్తుంది.
సూర్యాపేట, అక్టోబర్ 20: దసరా పండుగ వేళ సూర్యాపేట పట్టణంలో భారీ పేలుడు కలకలం రేపింది. స్థానిక పీఎస్సార్ సెంటర్‌లోని శ్రీసాయి సూపర్ మార్కెట్‌లో గ్యాస్ లీక్ కారణంగా సిలిండర్ పేలినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో సూపర్ మార్కెట్ తీవ్రంగా ధ్వంసమైంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. భారీ శబ్దంతో ఈ గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని సూపర్ మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్
కశ్మీర్‌లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు