టీమిండియాలోకి రీఎంట్రీపై మహమ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:36 PM
టీమిండియా వెటరన్ బౌలర్ మహమ్మద్ షమీ రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో షమీని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టులోకి పునరాగమనంపై షమీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా వెటరన్ బౌలర్ మహమ్మద్ షమీ రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో షమీని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టులోకి పునరాగమనంపై షమీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆశ అనేది ఎప్పుడూ ఉండాలని జాతీయ జట్టులో చోటు రావాలని ఉందన్నట్లు పరోక్షంగా తెలిపాడు. అలానే ప్రస్తుతం తన దృష్టి మొత్తం దేశవాళీ క్రికెట్, ఫిట్‌నెస్, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపైనే ఉందని షమీ స్పష్టం చేశాడు.
షమీ మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నేను జాతీయ జట్టులో లేను. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లోనూ కొనసాగడం లేదు. అలాంటప్పుడు నాతో వాళ్లు ఎందుకు మాట్లాడతారు?. అయితే ఏ రంగంలోనైనా మనకు ఆశ, లక్ష్యం ఉండాలి. వాటిని సాధించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. నాకు జాతీయ జట్టులోకి రావలనే ఆశ ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే ఈ విషయంపై ఏ సెలక్టర్లతోనూ మాట్లాడలేదు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతూ బిజీగా ఉన్నాను. ఈ టోర్నీలో నా జట్టును గెలిపించే లక్ష్యం తప్ప నాకు మరే ఆలోచన లేదు' అని షమీ పేర్కొన్నాడు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో షమీ టీమిండియా అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అతడు 2023 వన్డే ప్రపంచ కప్ లో 18 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు సాధించాడు. అందులో 7/57 అతని అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. ముంబైలో న్యూజిలాండ్‌పై ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో వెస్ట్ బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీ 2026-27లో భాగంగా నిన్న సర్వీసెస్ జట్టుతో జరిగిన బెంగాల్ రంజీ ట్రోఫీ 2026 మ్యాచ్‌లో మహమ్మద్ షమీ విరామం తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీమిండియాలోకి తన రీఎంట్రీపై పై వ్యాఖ్యలు చేశాడు.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్, శ్రీలంకకు ఐసీసీ జరిమానా.. కారణమిదే!
సూర్యాపేట సూపర్ మార్కెట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఆస్తి నష్టం
ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా