మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం గిఫ్ట్
ABN , Publish Date - Oct 20 , 2026 | 11:08 AM
తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి, ఎన్‌డీఏలోకి వచ్చిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు ఓ బహుమతి లభించబోతోంది. ఎన్నో ఏళ్ల నుంచి వివాదాస్పదంగా ఉన్న ఒక స్థలం ఆయనకు తిరిగి సొంతం కాబోతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి, ఎన్‌డీఏలోకి వచ్చిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు ఓ బహుమతి లభించబోతోంది. ఎన్నో ఏళ్ల నుంచి వివాదాస్పదంగా ఉన్న ఒక స్థలం ఆయనకు తిరిగి సొంతం కాబోతోంది. గత పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో యూసుఫ్ పఠాన్.. తృణమూల్ టికెట్‌పై ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన 20 మంది ఎంపీల్లో ఆయన కూడా ఉన్నారు. వీరంతా తరువాత ఎన్‌డీఏ కూటమిలో చేరారు.
కాగా రాజకీయ పక్షం మారగానే యూసుఫ్‌కు ఒక బహుమతి లభించనుంది. గుజరాత్‌లోని ఆయన ఇంటిని ఆనుకుని ఉన్న 1000 చదరపు అడుగుల స్థలంపై కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. 2012లో ఆ స్థలం తమకే చెందుతుందని, దానిపై సర్వ హక్కులు కల్పించాలని మాజీ క్రికెటర్ కోర్టులో కేసు వేశారు. అయితే సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత ఈ ఆస్తిని తిరిగి యూసుఫ్‌కే ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం పూనుకుంది. స్థలాన్ని అప్పగించే ప్రక్రియను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఆస్తిలో సగాన్ని యూసుఫ్‌కు బహుమతి రూపంలో ఇవ్వబోతోందని అంటున్నాయి. మిగతా సగాన్ని ఆయన నిర్ణీత ధరకు కొనుగోలు చేస్తారని పేర్కొంటున్నాయి.
అంటే స్థలంలోని సగభాగాన్ని యూసుఫ్‌కు గుజరాత్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. మిగిలిన భాగాన్ని ఆయన కొనుగోలు చేయనున్నారు. దీని ధర దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ వార్తలూ చదవండి
ధనుష్‌ను స్వాగతిస్తాం.. విజయ్ స్ఫూర్తితో ముందుకెళ్లొచ్చు: టీవీకే
దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు