Share News

దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 08:12 AM

విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు నిండిపోవాలని ఆయన ఆకాంక్షించారు.

దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు

ఇంటర్నెట్ డెస్క్: విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు నిండిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ‘విజయం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన ఈ విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి సంకల్పానికి నూతన శక్తిని అందించాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరి జీవితాలు సుఖసంతోషాలు, సౌభాగ్యం, విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయదశమి శుభ సందర్భంగా భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. రాముడిని ధర్మానికి, నైతిక ప్రవర్తనకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పండుగ అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి ప్రతీక. భారతీయ సంస్కృతి, నైతికత, కర్తవ్యానికి సంబంధించిన ఆదర్శాలపై ఆధారపడి ఉంది. శ్రీరాముడి విజయాన్ని స్మరించుకునే ఈ పర్వదినాన దేశ ప్రజలందరూ తమ వారసత్వంలోని ఉన్నత ఆదర్శాల మార్గంలో నడుస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం, సామరస్యపూర్వక సమాజ నిర్మాణంలో తమ వంతు సహకారం అందించాలని సంకల్పిద్దాం. ఈ పవిత్ర సందర్భంలో దేశ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

ప్రజలకు సీఎం దసరా శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్, లోకేశ్..

Updated Date - Oct 20 , 2026 | 08:47 AM