Share News

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:08 AM

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడిన జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జయచంద్ర గాంధీని విధుల నుంచి తప్పిస్తున్నట్టు చెప్పారు. అధికారులు, ఉద్యోగులు ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నడచుకోవాల్సిందేనని చెప్పారు.

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడిన జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జయచంద్ర గాంధీని విధుల నుంచి తప్పిస్తున్నట్టు చెప్పారు. అధికారులు, ఉద్యోగులు ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నడచుకోవాల్సిందేనని చెప్పారు. జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ దిల్లీరావు అన్నారు. ప్రభుత్వ అతిథి గృహం సమాచార పౌరసంబంధాల శాఖ మీడియా సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లను దిల్లీరావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ వంటి అంశాలతో పాటు జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ వరకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 6.25 కోట్ల నగదు, మద్యం, బంగారం, వెండి, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులను సీజ్‌ చేయటం జరిగిందన్నారు. 4300 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేయటం జరిగిందన్నారు. ఉల్లంఘనలకు సంబంధించి 867 ఫిర్యాదులను స్వీకరించి వీటిలో 837 పైగా పరిష్కరించామన్నారు. రాజకీయ పార్టీల డోర్‌ టు డోర్‌ ప్రచారానికి, ర్యాలీలకు తక్షణం అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ప్రచారానికి అయ్యే ఖర్చును పార్టీల ఖర్చులో రాయటం జరుగుతుందని, ఏప్రిల్‌ 18 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు అభ్యర్థుల ఖర్చులో రాయటం జరుగుతుందన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు ఫారం-6 కు సంబంధించిన చేర్పులకు అనుమతి ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఓటరుకు ఏ4 సైజుతో కూడిన ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 840 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్‌, వీడియోగ్రఫీ, మైక్రో ఆబ్జర్వర్ల పరిశీలన ద్వారా పర్యవేక్షణ జరుపుతామన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే సిబ్బంది కోసం బస్సులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పోలింగ్‌ విధులు నిర్వహించే పీవోలు, ఏపీవోలకు ఈనెల 13, 14 తేదీలలో మొదటి దశ, 29వ తేదీన రెండవ దశ శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. పోలింగ్‌ నిర్వహణకు బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్లను అవసరానికి మించి 120 శాతం పైగా సిద్ధం చేశామన్నారు. 85 సంవత్సరాలు పైబడిన, అర్హులైన పీడబ్ల్యూడీ ఓటర్లు, హోం ఓటింగ్‌కు ఫామ్‌ 12డీలను ఈనెల 29వ తేదీలోగా సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, స్టాటిస్టికల్‌ సర్వేలన్స్‌ టీ ములు పూర్తి పర్యవే క్షణ చేస్తున్నారని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద సీఆర్‌పీఎఫ్‌, స్టేట్‌ పోలీసు, సివిల్‌ ఆఫీసర్లతో గట్టి నిఘా ఉంచామన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 01:08 AM