Share News

ధనుష్‌ను స్వాగతిస్తాం.. విజయ్ స్ఫూర్తితో ముందుకెళ్లొచ్చు: టీవీకే

ABN , Publish Date - Oct 20 , 2026 | 09:55 AM

ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని, తమ పార్టీ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం సంతోషంగా ఉందని టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ తెలిపారు.

ధనుష్‌ను స్వాగతిస్తాం.. విజయ్ స్ఫూర్తితో ముందుకెళ్లొచ్చు: టీవీకే
Dhanush, Vijay

ఇంటర్నెట్ డెస్క్: తమిళ సినీ నటుడు ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం నేపథ్యంలో సీఎం విజయ్‌కి చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని, తమ పార్టీ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం సంతోషంగా ఉందని టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ రాజకీయ ప్రస్థానం కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు (TVK about Dhanush politics).


ధనుష్ అభిమాన సంఘాన్ని 'ధనుష్ నర్పణి ఇయక్కం' (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కోయంబత్తూరులో జరిగిన సమావేశానికి సుమారు 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో క్రమశిక్షణ, ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. అయితే, ఈ సమావేశానికి ధనుష్ హాజరుకాలేదు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అభిమాన సంఘం పేరును మార్చడం, ప్రజాసేవపై దృష్టి పెట్టడం వంటి పరిణామాలతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి (Dhanush political entry).


ఈ ఊహాగానాలపై టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ స్పందించారు (Tamil Nadu politics 2026). తమ పార్టీ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయ పార్టీని ప్రారంభించడం ఒక ఎత్తయితే, దానిని నడిపించడం, ఎన్నికల్లో విజయం సాధించడం మరో ఎత్తు అని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్నప్పుడే విజయ్ నటనకు దూరమై రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని సత్యకుమార్ గుర్తుచేశారు. విజయ్ మార్గాన్ని అనుసరించడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పారిస్ ముస్లిం నగరంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 20 , 2026 | 10:02 AM