జెలెన్‌స్కీతో కుదరదు.. యుద్ధం ఆపేందుకు మరొకరు కావాలి: ట్రంప్
ABN , Publish Date - Oct 20 , 2026 | 09:00 AM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై విమర్శలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై విమర్శలు చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్‌స్కీ కాకుండా మరొకరు చర్చలు జరిపితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రష్యాతో యుద్ధాన్ని ముగించే విషయంలో జెలెన్‌స్కీ వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు (Donald Trump about Zelensky).
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడో ముగిసి ఉండాల్సిందని, తన సూచనలను జెలెన్‌స్కీ వినివుంటే మరింత మెరుగైన ఒప్పందం కుదిరేదని ట్రంప్ అన్నారు. 'ఉక్రెయిన్ తరపున చర్చలు జరిపేందుకు మరొకరు ముందుకు రావాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది' అని ట్రంప్ పేర్కొన్నారు. జెలెన్‌స్కీ యుద్ధాన్ని ఆపేందుకు తగిన విధంగా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆరోపించారు (Russia Ukraine war).
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కలిసి చర్చలు జరిపే అంశంపైనా ట్రంప్ స్పందించారు (Ukraine peace talks). అలాంటి సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అణ్వాయుధాల నియంత్రణ, అణ్వాయుధ నిరాయుధీకరణ వంటి అంశాలపై చర్చించవచ్చని సూచించారు. జెలెన్‌స్కీ హాజరుకాకపోయినా యుద్ధాన్ని ముగించేందుకు తాను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఉక్రెయిన్‌కు చాలా సహాయం చేసిందని, ప్రతిగా తమకు ఏమీ లభించలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలోనే పారిస్ ముస్లిం నగరంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..