Share News

ఆస్ట్రేలియాపై బావుమా సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు!

ABN , Publish Date - Oct 20 , 2026 | 08:59 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అద్భుతసెంచరీతో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. మ్యాచ్ మూడో రోజున బావుమా ఈ ఘనత సాధించాడు.

ఆస్ట్రేలియాపై బావుమా సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు!
Temba Bavuma Century

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అద్భుతసెంచరీతో చరిత్రాత్మక రికార్డు సృష్టించాడు. మ్యాచ్ మూడో రోజున బావుమా ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ దెబ్బకు సౌతాఫ్రికా 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బవుమా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు.


ర్యాన్ రికెల్టన్‌తో కలిసి 52 పరుగులు, మార్కో జాన్సన్‌తో కలిసి 132 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పిన బావుమా.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. టెస్టు కెరీర్‌లో బావుమాకు ఇది ఐదో సెంచరీ. భారత్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా బావుమా (36 సంవత్సరాల 154 రోజులు) కొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో 2023లో నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.


ఆ సమయంలో రోహిత్ వయసు 35 సంవత్సరాల 285 రోజులుగా ఉంది. తాజాగా అతడి పేరిట ఉన్న రికార్డును బావుమా అధిగమించాడు. అలాగే, ఆస్ట్రేలియాపై టెస్టుల్లో సెంచరీ సాధించిన నాల్గో సౌతాఫ్రికా కెప్టెన్‌గా బావుమా మరో ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఇంతకుముందు గ్రేమ్ స్మిత్, జాక్వెస్ కల్లిస్, ఫాఫ్ డుప్లెసిస్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ సరసన బావుమా చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 127 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయిన ప్రొటీస్ జట్టు 425 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బావుమా 179 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్, శ్రీలంకకు ఐసీసీ జరిమానా.. కారణమిదే!

ఆసియా పారా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. డిస్కస్ త్రోలో క్లీన్‌స్వీప్!

రీల్స్‌ మోజులో చిన్నారిని పట్టించుకోని తల్లిదండ్రులు.. చివరికి..

Updated Date - Oct 20 , 2026 | 09:37 PM