Share News

మీ తీరు సరికాదు.. భారత పోలీసుల వైఖరిపై ఐరాస

ABN , Publish Date - Oct 20 , 2026 | 08:27 PM

భారత్‌లో యువత నిరసనలపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించడాన్ని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా గత 3 నెలలుగా జరుగుతున్న ఆందోళనలపై 16 మంది ఐరాస నిపుణులు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

మీ తీరు సరికాదు.. భారత పోలీసుల వైఖరిపై ఐరాస

ఇంటర్‌నెట్ డెస్క్: భారత్‌లో యువత నిరసనలపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించడాన్ని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా గత 3 నెలలుగా జరుగుతున్న ఆందోళనలపై 16 మంది ఐరాస నిపుణులు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. శాంతియుత నిరసన హక్కును కాపాడాలని భారత ప్రభుత్వానికి వారు సూచించారు. విద్యా వ్యవస్థలో మార్పులు, 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపుపై భారత్‌లో గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.


ఇటీవల ఢిల్లీలో 7 వేల మందికి పైగా యువత, జర్నలిస్టులు, న్యాయవాదలు ఆందోళన నిర్వహించారు. న్యాయవాదులు, జర్నలిస్టుల అరెస్టుపై ఐరాస నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారుల ఫోన్లు లాక్కొని డేటా డిలీట్ చేశారన్న ఆరోపణలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులపై బలప్రయోగం చేయడం, డిజిటల్ నిఘా పెట్టడం వంటివి తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

ట్రేడ్ డీల్‌ వల్ల భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపు: మార్కో రూబియో

ఎన్నికల్లో మోసం.. యూఎస్ గ్రీన్‌ కార్డు ఉన్న భారతీయులపై కేసు

Updated Date - Oct 20 , 2026 | 08:27 PM