అనైతిక చర్యకు పాల్పడ్డారని బంగ్లా జంటకు సౌదీలో ఉరిశిక్ష అమలు!
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:50 PM
మక్కా మసీదు నగరంలో అనైతిక చర్యకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక బంగ్లాదేశీ జంటను ఈనెల 14న సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరితీసింది. వారు అనైతిక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆ జంటను దోషిగా తేల్చింది. తజిర్ (ఇస్లామిక్ చట్టాల్లో ఒకటిది) చట్టం ప్రకారం వారు నేరానికి పాల్పడ్డారని న్యాయాధికారులు నిర్ధారించారని సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: మక్కా మసీదు నగరంలో అనైతిక చర్యకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక బంగ్లాదేశీ జంటను ఈనెల 14న సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరితీసింది. వారు అనైతిక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆ జంటను దోషిగా తేల్చింది. తజిర్(ఇస్లామిక్ చట్టాల్లో ఒకటిది) చట్టం ప్రకారం.. వారు నేరానికి పాల్పడ్డారని న్యాయాధికారులు నిర్ధారించారని సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. బంగ్లాదేశీ జంట అనైతిక చర్యకు పాల్పడడం వల్లే వారిని ఉరితీశారని ఆ శాఖ వెల్లడించింది. అయితే, ఆ జంట పాల్పడిన అనైతిక చర్య ఏమిటో ఆ శాఖ స్పష్టంగా వెల్లడించలేదు. అలాగే, తమ పౌరులను ఉరితీసిన విషయాన్ని సౌదీ ప్రభుత్వం తమకు సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ తెలిపింది.
సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సితి అక్తర్లను బంగ్లాదేశీయులుగా గుర్తించినట్టు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే వారు భార్యాభర్తలా అన్నది తెలియరాలేదు. ఇటీవలే మక్కా మసీదులో ఆ జంట అనైతిక చర్యకు పాల్పడిందని ఆ శాఖ తెలిపింది. దీంతో భద్రతా అధికారులు వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరిపి అభియోగాలు మోపారు. తర్వాత వారిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టారు. అధికారులు వారిపై మోపిన అభియోగాలను కోర్టు ధ్రువీకరించింది. తర్వాత ఆ జంటకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈనెల 14న వారిని ఉరితీసినట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు తమ దేశ పౌరులను సౌదీ ప్రభుత్వం ఉరితీయడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా.. మక్కా మసీదు లోపల ఆ జంట ముద్దుపెట్టుకుని ఉంటారని సోషల్ మీడియాలో పలువురు భావిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
ముంబై కుర్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా 9 మందికి గాయాలు
వెయ్యిసార్లైనా కన్నడిగులకు క్షమాపణ చెబుతా.. పహల్గామ్ దాడితో పోలికపై సోనూ నిగమ్ సారీ..