Share News

ముంబై కుర్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా 9 మందికి గాయాలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:09 PM

ముంబైలోని కుర్లా ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుర్లా వెస్ట్‌లోని కోహినూర్ హెచ్‌డీఐఎల్ బిల్డింగ్ నంబర్‌-5లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు.

ముంబై కుర్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా 9 మందికి గాయాలు
Mumbai Fire Accident

మహారాష్ట్ర: ముంబైలోని కుర్లా ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుర్లా వెస్ట్‌లోని కోహినూర్ హెచ్‌డీఐఎల్ బిల్డింగ్ నంబర్‌-5లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. 13 అంతస్తుల నివాస భవనంలోని విద్యుత్‌ డక్ట్‌లో ఉదయం 6:53 గంటలకు మంటలు చెలరేగాయి.


విద్యుత్‌ వైర్లు, డక్ట్‌ వ్యవస్థల ద్వారా పొగ వ్యాపించడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఉదయం 7:21 గంటలకే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ కారణంగా ఎనిమిది మందికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తగా.. మరొకరికి కుడి కాలికి గాయమైంది. క్షతగాత్రుల్లో ఐదేళ్ల బాలుడు, ఇద్దరు బాలికలు, ఓ వృద్ధుడు ఉన్నారు.


ప్రమాదం జరిగిన వెంటనే ముంబై అగ్నిమాపక శాఖ, పోలీసులు, విద్యుత్‌, 108 అంబులెన్స్‌ సిబ్బంది, మున్సిపల్‌ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను చికిత్స నిమిత్తం రాజావాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఈ వార్తలు కూడా చదవండి

మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం గిఫ్ట్

బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: మోహన్ భగవత్

Updated Date - Oct 20 , 2026 | 01:11 PM