Share News

ఆసియా పారా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. డిస్కస్ త్రోలో క్లీన్‌స్వీప్!

ABN , Publish Date - Oct 20 , 2026 | 07:53 PM

ఆసియా పారా క్రీడల్లో పురుషుల డిస్కస్ త్రో ఫైనల్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఈవెంట్‌లో పోటీ పడిన భారత్ ఏకంగా మూడు పతకాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

ఆసియా పారా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. డిస్కస్ త్రోలో  క్లీన్‌స్వీప్!
Asian Para Games

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా పారా క్రీడల్లో పురుషుల డిస్కస్ త్రో ఫైనల్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఈవెంట్‌లో పోటీ పడిన భారత్ ఏకంగా మూడు పతకాలను క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. దేవేందర్ కుమార్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, రాకేశ్ రజతం, ప్రదీప్ కుమార్ కాంస్య పతకాలను సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.


వివిధ క్లాసిఫికేషన్(F43/F44/F62/F64) విభాగాలకు చెందిన అథ్లెట్లు తలపడిన ఈ పోటీలో 'రజా పాయింట్ సిస్టమ్' ద్వారా విజేతలను నిర్ణయించారు. దేవేందర్ కుమార్ తన రెండో ప్రయత్నంలో 49.71 మీటర్ల దూరం డిస్కస్ విసిరిన 781 పాయింట్లతో పసిడి సొంతం చేసుకున్నాడు. అతడు తన తొలి ప్రయత్నంలో 48.85 మీటర్లు విసరగా, ఆ తర్వాత రెండు ఫౌల్స్ అయినా రెండో రౌండ్ ప్రదర్శనే దేవేందర్‌కు స్వర్ణం తెచ్చిపెట్టింది.


మరోవైపు రాకేశ్ తన నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమంగా 49.35 మీటర్లు విసిరి 771 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. అలాగే ప్రదీప్ కుమార్ 669 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. పారా క్రీడల్లో డిస్కస్ త్రోలో భారత అథ్లెట్లు మూడు పతకాలతో క్లీన్‌స్వీప్ సాధించడంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్, శ్రీలంకకు ఐసీసీ జరిమానా.. కారణమిదే!

సూర్యాపేట సూపర్ మార్కెట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఆస్తి నష్టం

రీల్స్‌ మోజులో చిన్నారిని పట్టించుకోని తల్లిదండ్రులు.. చివరికి..

Updated Date - Oct 20 , 2026 | 08:02 PM