Indian Cricket Board: జాతీయ క్రీడా బిల్లు పరిధిలోకి బీసీసీఐ
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:04 AM
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంతకాలం స్వతంత్రంగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రభుత్వం నుంచి బీసీసీఐ ఎటువంటి నిధులూ తీసుకోదు.. క్రీడా శాఖ కూడా బో ర్డు కార్యకలాపాల్లో...
బిన్నీకి లక్కీ చాన్స్?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంతకాలం స్వతంత్రంగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రభుత్వం నుంచి బీసీసీఐ ఎటువంటి నిధులూ తీసుకోదు.. క్రీడా శాఖ కూడా బో ర్డు కార్యకలాపాల్లో ఎక్కడా జోక్యం చేసుకొన్న సందర్భాలు లేవు. అయితే, బుధవారం కొత్త జాతీయ కీడా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే బీసీసీఐకి కూడా కొత్త క్రీడా చట్టం వర్తిస్తుందని క్రీడా మం త్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిధులపై బీసీసీఐ ఆధారపడకపోయినా.. జాతీయ క్రీడా బోర్డు నుంచి తప్పనిసరిగా గుర్తింపు పొందాల్సి ఉంటుందని తెలిపాయి. అయితే, మిగతా జాతీయ క్రీడా సంఘాల తరహాలోనే బీసీసీఐ స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. కానీ, ఏదైనా వివాదాలు తలెత్తితే మాత్రం ప్రతిపాదిత జాతీయ క్రీడా ట్రైబ్యునల్ పరిధిలోనే వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుత బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీకి నూతన స్పోర్ట్స్ బిల్లు వరంగా మారే అవకాశం ఉంది. బోర్డు రాజ్యాంగం ప్రకారం 70 ఏళ్లకు మించిన వారు ఏ పదవిలోనూ కొనసాగకూడదు. అయితే, గత శనివారంతో బిన్నీకి 70 నిండా యి. కానీ, బిల్లు ముసాయిదాలో ఈ వయో నిబంధనను 70 నుంచి 75 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన ఉంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 04:04 AM