Chennai Grandmasters Tournament: అర్జున్‌కు డ్రా
ABN, Publish Date - Aug 12 , 2025 | 02:36 AM
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో అర్జున్ ఇరిగేసికి మరో డ్రా ఎదురైంది. సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో సహచరుడు ప్రణవ్‌తో అర్జున్ పాయింట్ పంచుకొన్నాడు...
చెన్నై: చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో అర్జున్ ఇరిగేసికి మరో డ్రా ఎదురైంది. సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో సహచరుడు ప్రణవ్‌తో అర్జున్ పాయింట్ పంచుకొన్నాడు. తెల్లపావులతో ఆడిన అర్జున్ 78 ఎత్తుల అనంతరం ప్రణవ్‌తో డ్రాకు అంగీకరించాడు. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో కార్తికేయన్ మురళి, అవోండర్ లియాంగ్ (అమెరికా)తో నిహాల్ సరీన్ తన గేమ్‌లను డ్రా చేసుకొన్నారు. కాగా, చాలెంజర్స్‌లో ద్రోణవల్లి హారికకు నాలుగో ఓటమి ఎదురైంది. అభిమన్యు పురానిక్ చేతిలో హారిక, హర్షవర్ధన్ చేతిలో వైశాలి పరాజయం పాలయ్యారు.
ఇవి కూడా చదవండి..
ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 12 , 2025 | 02:36 AM