Share News

Virat Kohli-Rohit Sharma: ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?

ABN , Publish Date - Aug 10 , 2025 | 10:22 AM

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరో షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా? ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు.

Virat Kohli-Rohit Sharma: ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
Rohit Sharma, Virat Kohli

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) మరో షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా? ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఇద్దరూ ఒకేసారి టెస్ట్ ఫార్మాట్‌ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం వీరిద్దరూ వన్డేల్లో మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


వైట్ బాల్ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్డే క్రికెట్ నుంచి కూడా వైదొలగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీమిండియా వన్డే సిరీస్ ఆడబోతోంది. ఆ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఒకేసారి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. నిజానికి వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రపంచకప్ ఆడాలంటే బీసీసీఐ (BCCI) నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే దేశీయ వన్డే సిరీస్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడవలసి ఉంటుంది.


ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ కీలకం కాబోతోంది. ఈ ట్రోఫీలో ఆడితేనే రోహిత్, కోహ్లీ పేర్లను ప్రపంచకప్ కోసం పరిశీలిస్తారు. ఆ ట్రోఫీలో మెరుగ్గా రాణించిన యువ ఆటగాళ్ల వైపే సెలెక్టర్లు మొగ్గుచూపుతారనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఆస్ట్రేలియాలోనే తమ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు వినబడుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 2027 ప్రపంచకప్ లోపు టీమిండియా మరో ఆరు వన్డే సిరీస్‌లు ఆడబోతోంది.


ఇవి కూడా చదవండి..

ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా? టీమిండియాకు ధ్రువ్ ఉంటే కలిసొస్తోందా..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 10 , 2025 | 10:22 AM