Share News

Rohit Sharma: ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Aug 10 , 2025 | 09:07 AM

టీమిండియా వన్డే కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్‌నకు వెళ్లి తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చాడు.

Rohit Sharma: ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Rohit Sharma

టీమిండియా వన్డే కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్‌నకు వెళ్లి తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. తాజాగా ఓ విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. ఆ కారు తాజాగా ముంబైలోని రోహిత్ ఇంటికి డెలివరీ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.


ప్రముఖ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని నుంచి ఒక సూపర్ కారును రోహిత్ కొనుగోలు చేశాడు. ఆరెంజ్‌ కలర్‌ లంబోర్గిని ఉరుస్ ఎస్‌ఈ (Lamborghini Urus SE) కారును కొనుగోలు చేశాడు. భారతదేశంలో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.57 కోట్లు. ముంబైలో దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ.5.25 కోట్లు. అలాగే ఈ కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ విషయంలో కూడా రోహిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. తన కొత్త కారుకు రోహిత్ 3015 నెంబర్ తీసుకున్నాడు. ఆ నెంబర్‌కు ఓ ప్రత్యేకత ఉంది.


రోహిత్ కూతురు సమైరా డిసెంబర్ 30న జన్మించింది. కొడుకు అహన్ నవంబర్ 15న జన్మించాడు. వీరిద్దరి బర్త్‌డేలు కలిసి వచ్చేలా తన కొత్త కారుకు 3015 నెంబర్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా రోహిత్‌ లంబోర్గిని కారు ఉపయోగించాడు. ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ 264. వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రపంచరికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ఆ 264 పరుగలుకు గుర్తుగా తన కారుకు ఆ నెంబర్ తీసుకున్నాడు.


ఇవి కూడా చదవండి..

ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా? టీమిండియాకు ధ్రువ్ ఉంటే కలిసొస్తోందా..


ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 10 , 2025 | 09:07 AM