ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bodhana Sivanandan: చరిత్ర సృష్టించిన 10 ఏళ్ల చిన్నారి .. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి సరికొత్త రికార్డ్

ABN, Publish Date - Aug 16 , 2025 | 11:28 AM

సాధారణంగా 10 ఏళ్ల చిన్నారి అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది స్కూల్‌కి వెళ్లడం, ఆటలు ఆడటం, కార్టూన్లు చూడడం. కానీ బోధనా శివానందన్ అనే ఈ చిన్నారి మాత్రం తన చెస్ ఆట తీరుతో మాయ చేస్తోంది. చిన్న వయసులోనే అద్భుతమైన విజయాలు సాధిస్తూ వార్తల్లో నిలిచింది.

Bodhana Sivanandan

సాధారణంగా ఒక 10 ఏళ్ల చిన్నారి ఏం చేస్తుంది? స్కూల్‌కు వెళ్తుంది, ఆటలు ఆడుతుంది, టీవీ చూస్తుంది. కానీ, ఇక్కడ మనం చెప్పబోయే చిన్నారి బోధనా శివానందన్ (Bodhana Sivanandan) మాత్రం తన అద్భుతమైన చెస్ ఆటతో అదరగొడుతోంది. ఇటీవల జరిగిన 2025 బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్‌లో, ఈ 10 ఏళ్ల చిన్నారి గ్రాండ్‌మాస్టర్ పీటర్ వెల్స్ (వయసు 60) ను ఓడించి చెస్ ప్రపంచానికి షాక్‌ ఇచ్చింది. దీంతో చరిత్రలో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అత్యంత చిన్న వయస్కురాలిగా తన పేరు లిఖించుకుంది.

చెస్ ఆట ఎలా మొదలైంది?

భారత సంతతికి చెందిన బోధనాకు చెస్ పట్ల ఆసక్తి ఎలా వచ్చిందంటే, ఆమెకు 5 ఏళ్ల వయసులో ఒక చెస్ సెట్ బహుమతిగా లభించింది. అందులో తనకు క్వీన్స్ బాగా నచ్చాయంటా. అప్పటి నుంచే తన నాన్న సహకారంతో ఆట నేర్చుకున్నట్లు బోధనా తెలిపింది. దీంతోపాటు యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ నేర్చుకుంది. ఆ తర్వాత ఆమె స్థానిక టోర్నమెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. అలా ఆమె టాలెంట్ వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు భారతదేశంలోని తమిళనాడు తిరుచిరాపల్లికి చెందిన వారు కాగా, ప్రస్తుతం లండన్‎లో ఉంటున్నారు.

ప్రపంచ రికార్డు బ్రేక్

ఆగస్ట్ 10, 2025న లివర్‌పూల్‌లో జరిగిన బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్‌లో చివరి రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్ పీటర్ వెల్స్‌ను బోధనా ఓడించింది. ఆ రోజున ఆమె వయసు 10 సంవత్సరాలు, 5 నెలలు, 3 రోజులు. అంతకుముందు అమెరికన్ చెస్ ప్లేయర్ కారిస్సా యిప్ 2019లో 10 సంవత్సరాలు, 11 నెలలు, 20 రోజుల్లో ఒక గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించింది. ఇప్పుడు బోధనా ఆ రికార్డును బ్రేక్ చేసింది.

నేర్చుకోవడమే టార్గెట్

బోధనా చెస్ గేమ్ గురించి తన అభిప్రాయం చాలా స్పష్టంగా చెబుతుంది. నాకు గొప్ప ప్లేయర్లతో ఆడటం ఇష్టం. ఎందుకంటే వాళ్ల దగ్గరి నుంచి నేర్చుకోగలుగుతాను. ఓడినా సరే, వాళ్లు ఎలా ఆడుతున్నారో తెలుసుకుని నేనేం తప్పు చేశానో అర్థం చేసుకుంటానని తెలిపింది. ఇది తెలిసిన అనేక మంది ఇంత చిన్న వయసులో ఈ స్థాయి స్పష్టత, నైపుణ్యం ఉండటం నిజంగా గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 11:29 AM