ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pacific Ocean: మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే పరేషాన్!

ABN, Publish Date - Mar 13 , 2025 | 06:48 PM

సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే విధంగా మహా సముద్రంలో ఇటుకల రోడ్డు బయటపడింది. ఆ రోడ్డు సముద్ర గర్భంలోకి ఎలా వచ్చిందన్న దానిపై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సముద్ర గర్భాలు ఎన్నో అంతుచిక్కని అద్భుతాలకు నిలయాలు. చరిత్రలో నిలిచిపోయిన పెద్ద పెద్ద రాజ్యాల నుంచి మొన్నటి టైటానిక్ షిప్ వరకు ఎన్నిటినో సముద్రం తన గర్భంలో దాచేసుకుంది. సైంటిస్టుల పుణ్యమా అని లోపల దాగున్న ఎన్నో అద్భుతాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అలాంటిదే మహా సముద్రంలో ఇసుక రోడ్డు కూడా. 2022లో ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్‌కు చెందిన శాస్త్రవేత్తలు పసిఫిక్ మహా సముద్రంలో పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఓ మిషన్‌ను సముద్ర గర్భంలో 3 వేల మీటర్ల లోతుకు పంపారు. ఆ మిషన్ లావాకు సంబంధించిన వాటిని తవ్వుతూ ఉంది. ఆ దృశ్యాలను మిషన్‌కు అమర్చిన కెమెరా ద్వారా నీటిపైన ఉన్న సైంటిస్టులు లైవ్‌లో చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత వారికి ఓ విచిత్రమైన ప్రదేశం కనిపించింది. అది అచ్చం పసుపు రంగు ఇటుకల రోడ్డులా ఉంది.


దాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ రోడ్డు వేల ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన దానిలా ఉంది. ఆ ఇటుకల రోడ్డును చూసి ‘అది అట్లాంటిస్ నగరానికి మార్గం అయి ఉంటుందా?’.. అంటూ ఓ సైంటిస్ట్ ఆశ్చర్యపోయాడు. మిగిలిన వాళ్లు కూడా దాన్ని చూసి నోరెళ్లబెట్టారు. కొద్దిసేపు దాని గురించి చర్చించుకున్నారు. అయితే, ఆ ఇటుకల రోడ్డు మానవ నిర్మితమైనది కాదు. సముద్ర గర్భంలో లావా పొంగి, పగుళ్ల కారణంగా అలా తయారైంది. బట్టీలో ఇటుకలు తయారు చేయించి, వాటితో రోడ్డు వేసినట్లు చాలా చక్కగా ఆ పగుళ్లు ఏర్పడ్డాయి. దాదాపు 10 అడుగుల వెడల్పుతో.. 20 అడుగుల పొడవు వరకు ఆ ప్రదేశం ఉంది. ఇటుకల రోడ్డులా కనిపిస్తున్న ఆ ప్రదేశం మొత్తం చాలా పొడిగా ఉంది. మిగిలిన ప్రదేశం తడిగా ఉంది. ఇలా ఎందుకు ఉందో సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు.


వైరల్‌గా మారిన రోడ్డు వీడియో..

ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ ఆ పసుపు రోడ్డుకు సంబంధించిన వీడియోను తమ అధికారిక యూట్యూబ్ ఖాతాలో విడుదల చేసింది. 2022 సంవత్సరంలో విడుదల చేసిన ఆ వీడియోను ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా చూశారు. దాదాపు పది వేల మంది లైక్ చేశారు. వెయ్యి మంది కామెంట్లు పెట్టారు. 2022లో ఈ వీడియో తెగవైరల్ అయింది. ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది. లావా కారణంగా ఏర్పడ్డ ఆ రోడ్డును చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ అట్లాంటిస్ నిజంగానే ఉంది. అందుకు ఈ రోడ్డే సాక్ష్యం’.. ‘ సముద్రంలోని ఈ రోడ్డును చూడ్డం ఎంతో అద్భుతంగా ఉంది’..‘ దేవుడి సృష్టి ఎంత అద్భుతంగా ఉందో. మనిషికి ఇది సాధ్యం కాదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 07:14 PM