ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rapido Driver: పాపం ర్యాపిడో డ్రైవర్.. అడ్డంగా బుక్కయ్యాడు..

ABN, Publish Date - Jun 16 , 2025 | 09:31 PM

Rapido Driver: బెంగళూరుకు చెందిన ఓ యువతి రాపిడో బుక్ చేసుకుంది. ఓ 15 నిమిషాల తర్వాత ర్యాపిడో బైకు ఆమె ఉండే చోటుకు వచ్చింది. యువతి ఓటీపీ చెప్పి బైకు ఎక్కి కూర్చోగానే అక్కడినుంచి కదిలింది.

Rapido Driver

నాణేనికి రెండు వైపులు ఉన్నట్లే.. ప్రతీ సంఘటనకు రెండు వర్షన్లు ఉంటాయి. నూటికి తొంభై శాతం మంది మనుషులు.. ఓ వర్షన్‌ను మాత్రమే చూసి అవతలి వ్యక్తిని జడ్జ్ చేస్తూ ఉంటారు. బెంగళూరుకు చెందిన ఓ ర్యాపిడో బైక్ డ్రైవర్ విషయంలోనూ అదే జరిగింది. సోమవారం మధ్యాహ్నం ఆ ర్యాపిడో డ్రైవర్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయింది. ఆ వీడియోలో ఆ డ్రైవర్ ఓ యువతిని లాగి పెట్టి కొట్టాడు. దీంతో ఆ యువతి దూరంగా పోయి పడింది. ఈ వీడియో చూసిన అందరూ ఆ ర్యాపిడో బైక్ డ్రైవర్‌పై ఫైర్ అయ్యారు.

ఆ యువతిపై సానుభూతి చూపించారు. సాయంత్రానికంతా కథ మొత్తం మారిపోయింది. సంఘటనకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ద్వారా.. ర్యాపిడో బైక్ డ్రైవర్ యువతిపై చెయ్యి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో క్లియర్‌గా ఉంది. ఆ వీడియో ప్రకారం.. ఆ యువతి అతడిపై దాడికి దిగింది. మూడు, నాలుగు సార్లు చెయ్యి చేసుకుంది. తిడుతూ రెచ్చిపోయింది. టిఫిన్ బాక్సుతో కూడా కొట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

బెంగళూరుకు చెందిన ఓ యువతి రాపిడో బుక్ చేసుకుంది. ఓ 15 నిమిషాల తర్వాత ర్యాపిడో బైకు ఆమె ఉండే చోటుకు వచ్చింది. యువతి ఓటీపీ చెప్పి బైకు ఎక్కి కూర్చోగానే అక్కడినుంచి కదిలింది. యువతి వెళ్లాల్సిన గమ్యస్థానం వెైపు వెళుతూ ఉంది. కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తర్వాత యువతి బైకు ఆపమంది. డ్రైవర్ బైకు ఆపాడు. ‘నువ్వు చాలా ర్యాష్‌గా బైకు డ్రైవ్ చేస్తూ.. అసలు సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా వెళుతున్నావ్..’ అంటూ గొడవపెట్టుకుంది. చిన్న గొడవ కాస్తా కొద్దిసేపటి తర్వాత దాడి చేసుకునే వరకు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

హరీష్ రావుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..

ఏటీఎమ్ బద్దలు కొట్టి 27 లక్షలు దోచేశారు..

Updated Date - Jun 16 , 2025 | 09:44 PM