Harish Rao: హరీష్ రావుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..
ABN , Publish Date - Jun 16 , 2025 | 08:42 PM
Harish Rao Fall Ill: కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. అక్కడే అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా బేగంపేట సన్ షైన్ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ వలన ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. అక్కడే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి : హరీష్
కేటీఆర్ సోమవారం ఉదయం ఏసీబీ విచారణలో పాల్గొన్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగింది. ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారణ చేశారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో హరీష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ.. ‘కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నాడు. తుమ్మినా, దగ్గినా కేసులు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు’అంటూ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
ఏటీఎమ్ బద్దలు కొట్టి 27 లక్షలు దోచేశారు..
రూ.500 నోట్ల కట్టలు దొంగిలించిన కోతి.. ఏం చేసిందంటే..