Viral Video: లవర్‌తో దొరికిపోయిన కొడుకు.. నడిరోడ్డుపై చావ గొట్టిన తల్లి..
ABN, Publish Date - May 03 , 2025 | 09:35 PM
Viral Video: వాళ్లు ఇద్దరూ కలిసి నూడిల్స్ తినటం రోహిత్ తల్లి సుశీల, తండ్రి శివ కరణ్ చూశారు. ఇద్దరినీ ఒకే చోట కలిసి చూడటంతో సుశీల కోపం కట్టలు తెంచుకుంది. తల్లిదండ్రులను చూడగానే రోహిత్ స్కూటీ దగ్గరకు పరుగులు తీశాడు.
స్కూటీపై వెళుతున్న కొడుకును, అతడి ప్రియురాలిని ఓ తల్లి అడ్డగించింది. ఆ తర్వాత ఇద్దరినీ చెప్పుతో నడిరోడ్డుపై చావగొట్టింది. తలపై టపటపా వాయించేసింది. పక్కన ఉన్న వాళ్లు ఎంత ఆపినా ఆమె ఆగలేదు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌కు చెందిన 21 ఏళ్ల రోహిత్, 19 ఏళ్ల యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రోహిత్ ఇంట్లో వాళ్లకు తెలిసింది.
ఆ యువతితో దూరంగా ఉండాలని అతడికి వార్నింగ్ ఇచ్చారు. అయితే, అతడు తల్లిదండ్రుల మాటలను లెక్క చేయలేదు. శుక్రవారం లవర్‌కు ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు. ఇద్దరూ స్కూటీపై షికార్లు కొట్టారు. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర న్యూడిల్స్ తింటూ ఉన్నారు. వాళ్లు ఇద్దరూ కలిసి నూడిల్స్ తినటం రోహిత్ తల్లి సుశీల, తండ్రి శివ కరణ్ చూశారు. ఇద్దరినీ ఒకే చోట కలిసి చూడటంతో సుశీల కోపం కట్టలు తెంచుకుంది. తల్లిదండ్రులను చూడగానే రోహిత్ స్కూటీ దగ్గరకు పరుగులు తీశాడు. లవర్ అతడితో పాటు వెళ్లింది.
లవర్ స్కూటీ మీద కూర్చోగానే స్టార్ట్ చేసి అక్కడినుంచి పోవాలనుకున్నాడు. ఇంతలో తల్లి అడ్డం వచ్చింది. స్కూటీ ముందుకు వెళ్లనివ్వలేదు. బూతులు తిడుతూ చెప్పుతో అతడ్ని కొట్టింది. ఆ వెంటనే అతడి ప్రియురాలిపై కూడా దాడి చేసింది. కొడుకు ప్రియురాలి జుట్టు పట్టుకుని కూడా లాగింది. ఆ అమ్మాయి తన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తోందంటూ సుశీల రెచ్చిపోయింది. పక్కన ఉన్న వాళ్లు ఎంతో కష్టం మీద సుశీలను ఆపారు. నడిరోడ్డులో ఈ సంఘటన జరగటంతో జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
CRPF Constable: పాక్ మహిళతో పెళ్లి.. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌పై వేటు
APSDMA: ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం
Updated Date - May 03 , 2025 | 09:37 PM