Wife and Husband: ఇలాంటి భార్య ఉంటే అదృష్టమే.. ఆ భర్త ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి..
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:25 PM
ప్రస్తుతం చాలా మంది దంపతులు గొడవలు, అలకలు, కొట్లాటలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో భార్యాభర్తల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది. ఆ వీడియో నెటిజన్లు హృదయాలను ఆకట్టుకుంటోంది.
భార్యాభర్తల బంధం ఎంతో పటిష్టమైనది (Husband and Wife). ఇద్దరూ ఒకరి సంతోషం కోసం మరొకరు ఆలోచిస్తే వారి జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. చాలా మంది గొడవలు, అలకలు, కొట్లాటలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో భార్యాభర్తల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది. ఆ వీడియో నెటిజన్లు హృదయాలను ఆకట్టుకుంటోంది.
vinayshaarma అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక భార్య (Wife) తన భర్త (Husband)కు అతడికి ఇష్టమైన బైక్‌ను కొనిచ్చి సర్‌ప్రైజ్ చేసింది (Surprise Gift). ఆ బైక్‌ను చూసి అతడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే భార్యను కౌగిలించుకున్నాడు. దాంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. భార్య ఏడవడం చూసి భర్త కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. భార్యాభర్తల మధ్య అలాంటి ప్రేమ ఇటీవలి కాలంలో చాలా అరుదుగా కనిపిస్తోంది. దీంతో ఆ వీడియో చూసి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 18 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.37 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది నిజమైన అనుబంధమని, దేవుడు వీరిని చల్లగా చూడాలని ఒకరు కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వీడియోను చూడడం చాలా గొప్పగా ఉందని మరొకరు పేర్కొన్నారు. ఈ వీడియో ఎన్నో విషయాలను నేర్పుతోందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఫోటోలో ఉన్నవన్నీ Wలు కావు.. భిన్నంగా ఉన్న దాన్ని 5 సెకన్లలో కనిపెట్టండి..
ఎంత బాగా రాస్తే మాత్రం అన్ని మార్కులేస్తారా? బీహార్ యూనివర్సిటీ నిర్వాకం..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 05 , 2025 | 04:25 PM