Bihar University Marks: ఎంత బాగా రాస్తే మాత్రం అన్ని మార్కులేస్తారా? బీహార్ యూనివర్సిటీ నిర్వాకం..
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:57 PM
పరీక్ష ఎంత బాగా రాసినా వందకు వంద మార్కులే వేస్తారు తప్ప అంతకంటే ఒక్క మార్కు కూడా ఎక్కువగా వేయరు. అయితే బీహార్ యూనివర్సిటీ మాత్రం ఈ రూల్‌ను చెరిపేసింది. వందకు ఏకంగా 257 మార్కులు వేసింది. అన్ని మార్కులు సాధించినప్పటికీ ఆ విద్యార్థి పై క్లాస్‌కు ప్రమోట్ కాకపోవడం విషాదకరం.

పరీక్షలు (Exams) బాగా రాస్తే మంచి మార్కులు (Marks) వస్తాయి. మరీ బాగా రాసేస్తే వందకు వంద మార్కులు వస్తాయి. అయితే ఎంత బాగా రాసినా వందకు వంద మార్కులే వేస్తారు తప్ప అంతకంటే ఒక్క మార్కు కూడా ఎక్కువగా వేయరు. అయితే బీహార్ యూనివర్సిటీ మాత్రం ఈ రూల్‌ను చెరిపేసింది (Bihar University Marks). వందకు ఏకంగా 257 మార్కులు వేసింది. అన్ని మార్కులు సాధించినప్పటికీ ఆ విద్యార్థి పై క్లాస్‌కు ప్రమోట్ కాకపోవడం విషాదకరం. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్సిటీలో వెలుగు చూసింది.
బీహార్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇటీవల పోస్ట్ గ్రాడ్యుయేషన్ మూడో సెమిస్టర్ ఫలితాలను వెల్లడించింది. పరీక్షకు హాజరైన దాదాపు 9 వేల మంది విద్యార్థులలో 8 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఒక విద్యార్థికి కనీవినీ ఎరుగని రీతిలో 100కు 257 మార్కులు వచ్చాయి. ఆ విద్యార్థికి అన్ని మార్కులు ఎలా వచ్చాయో ఆ ప్రొఫెసర్లకు కూడా అర్థం కావడం లేదు. అయితే అంత అపరిమితంగా మార్కులు తెచ్చుకున్న సదరు విద్యార్ధి మాత్రం పై తరగతికి ప్రమోట్ కాకపోవడం విచిత్రం.
ఈ ఒక్క కుర్రాడి విషయంలోనే కాదు.. చాలా మంది విద్యార్థుల పరీక్షల ఫలితాల విషయంలో గందరగోళం నెలకొంది. ఫెయిలైన విద్యార్థుల్లో అధిక మంది కేవలం 1, 2 మార్కుల తేడాతో ఫెయిల్ కావడం విచిత్రంగానే ఉంది. అసలేం జరిగిందో అర్థం కాక విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అయితే యూనివర్సిటీ సిబ్బంది మాట్లాడుతూ.. ఫలితాలను ఎక్సెల్ షీట్‌లో ఎంట్రీ చేసే సమయంలో తప్పిదం జరిగినట్టు చెబుతున్నారు. మార్కుల ఎంట్రీని సరిచేసి మళ్లీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
వీడు నావాడు.. పెళ్లి వేదికపై వరుడిని కౌగిలించుకున్న బుర్కా మహిళ.. వధువు రియాక్షన్ చూస్తే..
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో గుర్రం ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..