ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పనిలో పడి కొడుకును పట్టించుకోలేదు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Aug 13 , 2025 | 03:05 PM

ప్రమాదాల గురించి అవగాహన వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ తల్లి తన పనిలో పడి పిల్లాడిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Mother and Son

చిన్న పిల్లలను (Kids) ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి. పనిలో ఎంత బిజీగా ఉన్నా పిల్లల మీద ఓ కన్నేసి ఉంచాలి. అభం శుభం తెలియని పిల్లలు ఎప్పుడు, ఏ ప్రమాదంలో చిక్కుకుంటారో తెలియదు. అందుకే వారికి ప్రమాదాల గురించి అవగాహన వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ తల్లి (Mother) తన పనిలో పడి పిల్లాడిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

@geetappoo అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను (Viral Video) సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంట్లో మంచం షెల్ఫ్ తెరిచి లోపల బట్టలను సర్దుకుంటోంది. అప్పుడు ఆమె కొడుకు వచ్చి ఆ షెల్ఫ్ లోపల కూర్చున్నాడు. ఆ మహిళ తన కొడుకును చూసి బయటకు లాగింది. ఆ తర్వాత ఆమె మళ్లీ తన పనిలో పడిపోయింది. ఆ పిల్లవాడు మళ్లీ వెళ్లి అక్కడే కూర్చున్నాడు. పనిలో బిజీగా ఉన్న మహిళ తన కొడుకును చూసుకోలేదు. బట్టలు సర్దేసిన తర్వాత ఆమె ఆ మంచం షెల్ప్‌ను మూసివేసింది.

పిల్లవాడు ఏడుస్తున్న శబ్దం విని, పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె మంచం షెల్ఫ్‌ను తెరిచి కొడుకును కాపాడింది. ఆ కుర్రాడి ఏడుపు శబ్దం వినబడకపోతే ఏం జరిగేదో ఊహించడమే కష్టం. ఆ ఘటన ఆ గదిలో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను దాదాపు ఆరు లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. పిల్లలను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని ఒకరు సూచించారు.

ఇవి కూడా చదవండి..

ఈ గడ్డిలో పురుగు కనబడిందా.. మీ కళ్లకు ఇక తిరుగులేనట్టే..


ఆ కుక్క మనసు ఎంత గొప్పది.. చిన్న పిల్లలను కాపాడడానికి ఎలా పరిగెత్తిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 13 , 2025 | 03:05 PM