Dog saves child: ఆ కుక్క మనసు ఎంత గొప్పది.. చిన్న పిల్లలను కాపాడడానికి ఎలా పరిగెత్తిందో చూడండి..
ABN , Publish Date - Aug 11 , 2025 | 07:15 AM
తాజాగా రిషికేష్‌లోని ఓ ప్రాంతంలో వీధి కుక్కల బారి నుంచి పిల్లలను కాపాడేందుకు ఓ పెంపుడు కుక్క సూపర్ హీరోలా రంగంలోకి దిగింది. ఆ వీడియో ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఇటీవలి కాలంలో వీధి కుక్కలు (Stray Dogs) చాలా ప్రమాదకరంగా మారాయి. చిన్న పిల్లలపై దాడి చేస్తూ వారిని గాయపరచడమో, చంపెయ్యడమో చేస్తున్నాయి. మన హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు నగరాల్లో వీధి కుక్కల కారణంగా ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఎదురవుతోంది. అయితే తాజాగా రిషికేష్ (Rishikesh)లోని ఓ ప్రాంతంలో వీధి కుక్కల బారి నుంచి పిల్లలను కాపాడేందుకు ఓ పెంపుడు కుక్క సూపర్ హీరోలా రంగంలోకి దిగింది. ఆ వీడియో ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
@gharkekalesh అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను (Viral Video) సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. మొదట జర్మన్ షెప్పర్డ్ కుక్క (German Shepherd) తన ఇంటి ఆవరణలో కూర్చుని ఉంది. వీధిలో నలుగురు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ వీధి కుక్క వారి వెంటపడింది. వారిలో చిన్న పిల్లాడిని లక్ష్యంగా చేసుకుని వెంబడించింది. ఆ దృశ్యం చూసిన జర్మన్ షెప్పర్డ్ తన ఇంటి గోడ మీద నుంచి బయటకు దూకి ఆ వీధి కుక్కను వెంబడించింది. దీంతో ఆ వీధి కుక్క వెనక్కి తిరిగి చూడకుండా అక్కణ్నుంచి పరుగులు లంఘించింది.
ఈ వీడియో ఓ ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. రిషికేష్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుక్కపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ జర్మన్ షెప్పర్డ్ యాక్షన్ హీరో తరహాలో రంగ ప్రవేశం చేసిందని ఒకరు కామెంట్ చేశారు. చాలా పెంపుడు కుక్కలు సమయం వచ్చినపుడు ప్రాణాలను కాపాడతాయని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కస్టమర్ల ఆరోగ్యం అంటే లేక్కే లేదు.. ఆయిల్ ప్యాకెట్లను ఎలా విప్పుతున్నాడో చూడండి..
ఇలాంటి వాళ్లనేం చేయాలి.. రీల్ కోసం చీర అంటించుకుని డ్యాన్స్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..