Viral Video: కస్టమర్ల ఆరోగ్యం అంటే లేక్కే లేదు.. ఆయిల్ ప్యాకెట్లను ఎలా విప్పుతున్నాడో చూడండి..
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:09 PM
బయట స్టాల్స్‌లో అమ్మే ఆహారం తినకూడదని వైద్యులు, పెద్దలు చెబుతుంటారు. అక్కడ శుచి, శుభ్రత ఉండదని, కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటారని చాలా మంది నమ్ముతుంటారు. అయినా బయట తినే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.
బయట స్టాల్స్‌లో అమ్మే ఆహారం (Food) తినకూడదని వైద్యులు, పెద్దలు చెబుతుంటారు. అక్కడ శుచి, శుభ్రత ఉండదని, కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటారని చాలా మంది నమ్ముతుంటారు. అయినా బయట తినే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా పంజాబ్ (Punjab) నుంచి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని ఓ ఫుడ్ స్టాల్ యజమాని చేసిన పని చాలా మందికి ఆగ్రహం కలిగిస్తోంది.
therealharryuppal అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ పకోడీలు వేస్తున్నాడు. అందుకోసం ముందుగా కొన్ని ఆయిల్ ప్యాకెట్లను (Oil Packets) తీసుకొచ్చాడు. అయితే ఆ ఆయిల్ ప్యాకెట్లను కట్ చేయకుండా వాటిని నేరుగా వేడి వేడి నూనెలో ముంచాడు. దీంతో ఆ ప్లాస్టిక్ కరిగిపోయి ప్యాకెట్లలోని నూనె ఆ పెనంలోకి వెళ్లిపోయింది. ఆ నూనెతో పాటు ప్లాస్టిక్ కూడా ఆ పెనంలోకి వెళుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 26 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అవి మైక్రోప్లాస్టిక్ పకోడీలని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ఆ నూనెతో చేసినవి తిన్న వారికి కేన్సర్ వస్తుందని మరొకరు పేర్కొన్నారు. ఆకలితో వచ్చి కేన్సర్‌ని తీసుకెళ్లండని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి వాళ్లనేం చేయాలి.. రీల్ కోసం చీర అంటించుకుని డ్యాన్స్..
మీ కళ్లకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 17 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..