Bride Video: వీడు నావాడు.. పెళ్లి వేదికపై వరుడిని కౌగిలించుకున్న బుర్కా మహిళ.. వధువు రియాక్షన్ చూస్తే..
ABN, Publish Date - Jul 03 , 2025 | 03:38 PM
పెళ్లిలో వరుడి స్నేహితులు సరదా చిలిపి పనులు చేసి అందర్నీ నవ్విస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేం. ఆ వీడియోలో వధువు అయితే వరుడి స్నేహితుడు చేసిన పనికి పగలబడి నవ్వింది. ఆ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత మధురమైన ఘట్టం. ముఖ్యంగా వధూవరులు ఆ రోజు ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటారు. వరుడి (Groom) స్నేహితులు సరదాగా చిలిపి పనులు చేసి అందర్నీ నవ్విస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేం. ఆ వీడియోలో వధువు (Bride) అయితే వరుడి స్నేహితుడు చేసిన పనికి పగలబడి నవ్వింది. ఆ ఫన్నీ వీడియో (Funny Video) ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
youknowjpvlogs అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతోంది. వివాహ వేదికపై వధూవరులు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో బుర్కా ధరించిన ఓ యువతి వచ్చి వరుడిని కౌగిలించుకుంది. 'వీడు నా వాడు' అంటూ వరుడిని వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఓ వ్యక్తి వచ్చి పక్కకి లాగుతున్నా ఆ బుర్కా మహిళ కదలలేదు. అసలేం జరుగుతోందో అర్థం కాక వధువు బిక్కమొహం వేసింది. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి బుర్కా పక్కకు తొలగించాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఆ బుర్కాలో ఉన్నది పురుషుడు అని తెలుసుకుని వధువు పగలబడి నవ్వింది. పక్కకు వెళ్లిపోయి విపరీతంగా నవ్వుకుంది. అక్కడున్న అందరూ కూడా సరదాగా నవ్వుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించారు. 1.8 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. పెళ్లిలో గుండెపోటు తెచ్చే ఇలాంటి స్నేహితుడు ఎవరికీ ఉండకూడదని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ క్రియేటివిటీ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.. స్కూటీ ఎంత వేగంగా వెనక్కు వెళ్తోందో చూడండి..
మీది డేగ చూపు అయితే.. ఈ బెడ్రూమ్‌లో టూత్‌బ్రష్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
ఈ రూ.500 నోటు విలువ ఐదు వందలు కాదు.. దీనికి ఎంత డిమాండ్ ఉందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 03 , 2025 | 03:38 PM