Share News

Rs.500 Note: ఈ రూ.500 నోటు విలువ ఐదు వందలు కాదు.. దీనికి ఎంత డిమాండ్ ఉందంటే..

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:35 PM

న్యూమరాలజీని నమ్మేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. తమకు కావాల్సిన మొబైల్ నెంబర్ కోసం వేలల్లో ఖర్చుపెట్టే వారు ఉంటారు. ఇక, కొందరు కారు నెంబర్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. అదే కోవలో స్పెషల్ సీరియల్ నెంబర్ కలిగిన రూ.500 నోటు కోసం కొందరు ఎగబడుతున్నారు.

Rs.500 Note: ఈ రూ.500 నోటు విలువ ఐదు వందలు కాదు.. దీనికి ఎంత డిమాండ్ ఉందంటే..
Rare RS.500 note

సాధారణంగా రూ.500 నోటు (Rs.500 Note) విలువ ఎంతంటే ఏమని చెబుతాం. ఐదు వందల రూపాయలు అనే చెబుతాం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూ.500 నోటు విలువ మాత్రం లక్షల్లో ఉంది. దానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవక తప్పదు. దానికి కారణం ఆ రూ.500 నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్. స్పెషల్ సీరియల్ నెంబర్‌ను కలిగి ఉన్న ఆ రూ.500 నోటుకు భారీ డిమాండ్ నెలకొంది. లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా కొందరు సిద్ధమవుతున్నారు (rare 500 note).


న్యూమరాలజీని నమ్మేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. తమకు కావాల్సిన మొబైల్ నెంబర్ కోసం వేలల్లో ఖర్చుపెట్టే వారు ఉంటారు. ఇక, కొందరు కారు నెంబర్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. అదే కోవలో స్పెషల్ సీరియల్ నెంబర్ కలిగిన రూ.500 నోటు కోసం కొందరు ఎగబడుతున్నారు. ఆ నోటు సీరియల్ నెంబర్ 1DL 777777. సాధారణంగా 7 సంఖ్యను చాలా మంది లక్కీ నెంబర్‌గా భావిస్తుంటారు. అందుకే ఈ నోటుకు డిమాండ్ ఏర్పడింది. ఈ నోటును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. @ResponsibleWalrus361 అనే రెడ్డిట్ యూజర్‌ దగ్గర ఈ నోటు ఉంది (Rs.500 serial number 777777).

500-note.jpg


ఆ నోటును రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఆ యూజర్ 'దీని నుంచి నేను ఏమైనా సంపాదించగలనా' అని రాశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నోటును కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఒకరు ఆ నోటు కోసం లక్ష రూపాయలు చెల్లించేందుకు కూడా ముందుకు వచ్చారు. అలాగే మరికొందరు తమ దగ్గర ఉన్న ప్రత్యేకమైన నోట్ల ఫొటోలను కూడా పంచుకున్నారు. అలాంటి నోట్లను జాగ్రత్తగా దాచుకుంటే భవిష్యత్తులో పెట్టబడిగా పనికి వస్తాయని కొందరు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఈ క్రియేటివిటీ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.. స్కూటీ ఎంత వేగంగా వెనక్కు వెళ్తోందో చూడండి..


మీది డేగ చూపు అయితే.. ఈ బెడ్రూమ్‌లో టూత్‌బ్రష్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 02 , 2025 | 04:35 PM