Thief Funny Video: దొంగకు దారుణ పరాభవం.. ఈ వీడియో చూస్తే దొంగలు కూడా సిగ్గుపడతారేమో..
ABN, Publish Date - Jul 25 , 2025 | 07:07 PM
దొంగతనం చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో నేర్పు, ప్రతిభ ఉండాలి. ప్లానింగ్ ఉండాలి. ఇవేవీ లేకుండా దొంగతనానికి వెళితే దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ దొంగ తీరు చూస్తే నవ్వు రాక మానదు.
అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి. దొంగతనం (Theft) చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో నేర్పు, ప్రతిభ ఉండాలి. ప్లానింగ్ ఉండాలి. ఇవేవీ లేకుండా దొంగతనానికి వెళితే దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ దొంగ (Thief) తీరు చూస్తే నవ్వు రాక మానదు. ఆ ఘటన షాప్ బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
unknown_5ukoon_04 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి స్కూటీ మీద వచ్చి ఒక షాప్ ముందున్న ఫ్రూట్ ట్రేను చోరీ చేయడానికి ప్రయత్నించాడు. ట్రేను తీసుకుని తన స్కూటీ మీద పెట్టుకున్నాడు. అయితే స్కూటీని రోడ్డు మీద టర్నింగ్ చేస్తున్నప్పుడు ఆ ట్రే కింద పడిపోయింది. అందులోని పళ్లన్నీ రోడ్డు మీద పడిపోయాయి. ఆ తర్వాత స్కూటర్‌ను బ్యాలెన్స్ చేసి ట్రేని తీసున్నాడు. ఈ లోగా అతని హెల్మెట్ కింద పడిపోయింది.
ఆ హెల్మెట్‌ను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్కూటర్ కింద పడిపోయింది. ఆ తర్వాత అతను స్కూటర్‌ను పైకి లేపి కొంచెం ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత రోడ్డు మీద జారి స్కూటీతో సహా కింద పడిపోయాడు. ఆ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది స్పందించారు. అతడిని చూస్తే దొంగలు కూడా సిగ్గుపడతారని ఒకరు కామెంట్ చేశారు. అదే అతడి మొదటి దొంగతనం అయి ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..
వామ్మో.. ఇది ప్రమాదకరమైన డ్యాన్స్.. వేదికపై వరుడి డ్యాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 25 , 2025 | 07:07 PM