Bride funny Dance: వామ్మో.. ఇది ప్రమాదకరమైన డ్యాన్స్.. వేదికపై వరుడి డ్యాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:30 PM
పెళ్లిలో బంధుమిత్రుల హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో వధూవరుల డ్యాన్స్ అనేది తప్పనిసరి కార్యక్రమంగా మారిపోయింది. పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు కొందరు శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు వేర్వేరు పెళ్లి వేడుకలు వైరల్ అవుతున్నాయి.
పెళ్లి (Weddding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. ఆ కార్యక్రమం చాలా వైభవంగా, సందడిగా జరగాలని అందరూ కోరుకుంటారు. పెళ్లిలో బంధుమిత్రుల హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో వధూవరుల డ్యాన్స్ (Bride Dance) అనేది తప్పనిసరి కార్యక్రమంగా మారిపోయింది. పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు కొందరు శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు వేర్వేరు పెళ్లి వేడుకలు వైరల్ అవుతున్నాయి. ఆయా వీడియోల్లో డ్యాన్స్‌లు చూస్తే మతిపోవడం ఖాయం (Bride funny Dance).
tabbuindianvoice అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వేదిక మీద వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఒక వీడియోలో వధువు నిలబడి ఉండగా వరుడు విచిత్రమైన డ్యాన్స్ చేస్తున్నాడు. వధువు చుట్టూ తిరుగుతూ తనకు మాత్రమే సాధ్యమైన డ్యాన్స్ చేశాడు. మరో వీడియోలో వరుడు నిలబడి ఉండగా అతడి ముందు వధువు డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ చూస్తే నవ్వు రావడం ఖాయం. ఆ రెండు వీడియోల్లోనూ డ్యాన్స్ చేస్తున్న వారిని చూసి వారి భాగస్వాములు ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోను 22 లక్షల మందికి పైగా వీక్షించారు. 29 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. దేవుడెప్పుడూ సీరియస్ వ్యక్తులకు ఓ జోకర్‌ను జోడిస్తాడని ఒకరు కామెంట్ చేశారు. దేవుడా.. ఇలాంటి డ్యాన్స్ చూసే అవకాశం తనకు మరోసారి ఇవ్వవద్దని ఇంకొకరు పేర్కొన్నారు. అది ఏ స్టైల్ డ్యాన్స్ అనేది నాకు కొంచెం చెప్పండి అని మరొకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..
స్లిమ్‌గా మారేందుకు రెండు వారాల డైట్.. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌కు చైనా యువతి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..