Viral Video: వంట గది నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని దగ్గరకు వెళ్తే ఒళ్లు జలదరించే దృశ్యం..
ABN, Publish Date - Jul 06 , 2025 | 04:11 PM
ఆ ఇంటి వంట గది నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ఎంత వెతికినా ఏమీ కనబడలేదు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వారికి అంతుబట్టడం లేదు. చివరకు మొత్తం వెతకగా వంట గది డ్రైన్ పైప్ నుంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు అర్థమైంది. దగ్గరకు వెళ్లి చేస్తే ఒళ్లు జలదరించే దృశ్యం కంటబడింది.
ఆ ఇంటి వంట గది (Kitchen) నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ఎంత వెతికినా ఏమీ కనబడలేదు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వారికి అంతుబట్టడం లేదు. చివరకు మొత్తం వెతకగా వంట గది డ్రైన్ పైప్ నుంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు అర్థమైంది. దగ్గరకు వెళ్లి చూస్తే ఒళ్లు జలదరించే దృశ్యం కంటబడింది. ఆ డ్రైన్ పైప్ లోపల ఏకంగా 30 అడుగుల పొడవున్న భారీ సర్పం (Huge Snake) ఉంది. ఆ పైప్‌లో అది ముందుకూ, వెనక్కూ కదలలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Snake Video).
muhammad.nasirin.75 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వంట గది డ్రైన్ పైప్ లోపల ఓ భారీ సర్పం కనబడుతోంది. అది ముందుకూ, వెనక్కి కదలుతోంది. ఆ పాము ఎలుకను లేదా కప్పను పట్టుకోవడానికి అక్కడకు వచ్చి ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. ఆ భారీ పాము తలను చూస్తే ఆ పాము దాదాపు 30 అడుగుల పొడువు ఉంటుందని ఊహించవచ్చు. ఆ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. 'పాము ఆహారం కోసం వెతుకుతున్నట్లు అనిపిస్తుంది. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో చాలా పాములు ఇళ్లలోకి వచ్చేస్తాయి' అని కామెంట్ చేశారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 87 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు రెండు లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. తల సైజును చూస్తే, ఆ పాము 30 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండాలి అని ఒకరు కామెంట్ చేశారు. వామ్మో.. అంత భారీ సర్పం అందులోకి ఎలా వెళ్లగలిగింది అంటూ మరొకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
ఏసీ కంపెనీలు భయపడాల్సిందే.. ఈ కూలర్ ముందు ఏసీలు కూడా పనికి రావట..
ఈ ఫోటోలో Nల మధ్యలో కొన్ని Mలు కూడా ఉన్నాయి.. ఎన్ని ఉన్నాయో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 06 , 2025 | 05:06 PM