Share News

Jugaad video: ఏసీ కంపెనీలు భయపడాల్సిందే.. ఈ కూలర్ ముందు ఏసీలు కూడా పనికి రావట..

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:44 PM

ఏసీలను అందరూ కొనలేరు. దాంతో కూలర్లతో సరిపెట్టుకోక తప్పని పరిస్థితి. సాధారణంగా కూలర్లను ఐరన్‌తో తయారు చేస్తారు. అయితే సిమెంట్, ఇటుకలతో తయారు చేసిన కూలర్‌ను ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jugaad video: ఏసీ కంపెనీలు భయపడాల్సిందే.. ఈ కూలర్ ముందు ఏసీలు కూడా పనికి రావట..
Cooler Made Of Brick And Cement

ఎండలు మండిపోయే వేసవి కాలంలో ఏసీ (AC)లు ఉంటేనే కాస్త చల్లదనం దొరుకుతుంది. కొందరు కూలర్లు (Coolers) ఉపయోగిస్తున్నా అవి ఏసీల స్థాయిలో పని చేయలేవు. అయితే ఏసీలను అందరూ కొనలేరు. దాంతో కూలర్లతో సరిపెట్టుకోక తప్పని పరిస్థితి. సాధారణంగా కూలర్లను ఐరన్‌తో తయారు చేస్తారు. అయితే సిమెంట్, ఇటుకలతో తయారు చేసిన కూలర్‌ (Cooler Made Of Brick And Cement)ను ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


shispal_sahu అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటి బయట ఇటుక, సిమెంటుతో తయారు చేసిన కూలర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దానికి నలువైపులా గడ్డిని అమర్చారు. కూలర్‌లో నీటిని నింపడానికి పైపును కూడా ఏర్పాటు చేశారు. లోపల ఫ్యాన్‌ను అమర్చడంతో చల్లగాలి వేస్తుంది. అయితే ఈ స్పెషల్ కూలర్‌ను ఆ వ్యక్తి పశువుల కోసం ఏర్పాటు చేశాడు. వేసవిలో ఆవులు, గేదెలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆ స్పెషల్ కూలర్‌ను ఏర్పాటు చేశాడు.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. 4.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ కూలర్ ఎన్ని దశాబ్దాలు అయినా పాడైపోదు అని ఒకరు కామెంట్ చేశారు. ఇది దేశీ టెక్నాలజీతో రూపొందించిన కూలర్ అని మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

ఉడుము పట్టు అంటే ఇదేనేమో.. రెండు ఉడుముల ఫైటింగ్ చూశారా?


ఇలాంటి భార్య ఉంటే అదృష్టమే.. ఆ భర్త ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 06 , 2025 | 03:44 PM