Share News

Monitor Lizards Fighting: ఉడుము పట్టు అంటే ఇదేనేమో.. రెండు ఉడుముల ఫైటింగ్ చూశారా?

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:18 PM

రకరకాల జంతువులు ఫైటింగ్ చేసుకుంటున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే రెండు ఉడుములు ఫైటింగ్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Monitor Lizards Fighting: ఉడుము పట్టు అంటే ఇదేనేమో.. రెండు ఉడుముల ఫైటింగ్ చూశారా?
Monitor Lizards Fighting

ఇంటర్నెట్ డెస్క్: మనుషుల్లో లాగానే జంతువుల్లోనూ తగాదాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఒకే జాతికి చెందిన జంతువులు పరస్పరం దాడులకు పాల్పడుతుంటాయి. రకరకాల జంతువులు ఫైటింగ్ చేసుకుంటున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే రెండు ఉడుములు (Monitor Lizards) ఫైటింగ్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.


వీడియోను రాజస్థాన్‌ (Rajasthan)లో చిత్రీకరించారు. ఆ వీడియోలో రెండు భారీ ఉడుములు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి (Monitor Lizards Fighting). ఒకదానినొకటి తోసేసుకుంటున్నాయి. ఆ ఫైటింగ్‌లో ఒక్కో సందర్భంలో ఒక్కో ఉడుము పైచేయి సాధిస్తోంది. బురదలో జరుగుతున్న ఈ ఫైటింగ్ హాలీవుడ్ యాక్షన్ సినిమా సీన్‌ను తలపిస్తోంది. ఆ రెండింటిలో ఏదీ వెనక్కి తగ్గడం లేదు. ఆ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఉడుము పట్టు నుంచి విడిపించుకోవడం కష్టం అంటారు. అయితే రెండు ఉడుముల మధ్య ఫైటింగ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఇద్దరు రెజ్లర్లు పోటీ పడుతున్నప్పుడు రిఫరీ ఎక్కడకు వెళ్లాడంటూ ఒకరు సరదాగా కామెంట్ చేశారు. ఈ పోటీలో చివరకు ఎవరు గెలిచారని మరొకరు ప్రశ్నించారు. ఇది నిజమైన డబ్ల్యూడబ్ల్యూఈ పోరాటమని ఇంకొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఫోటోలో ఉన్నవన్నీ Wలు కావు.. భిన్నంగా ఉన్న దాన్ని 5 సెకన్లలో కనిపెట్టండి..


ఎంత బాగా రాస్తే మాత్రం అన్ని మార్కులేస్తారా? బీహార్ యూనివర్సిటీ నిర్వాకం..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 05 , 2025 | 05:31 PM