Shocking video: అదృష్టం అంటే ఇదే.. ఈ ఆంటీ ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందో చూడండి..
ABN, Publish Date - Jul 27 , 2025 | 08:11 PM
అదృష్టవంతులు సముద్రంలో పడినా ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటారనేది ఓ సామెత. కొన్ని కొన్ని వీడియోలను చూస్తుంటే అది కచ్చితంగా నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.
అదృష్టవంతులు (Lucky) సముద్రంలో పడినా ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటారనేది ఓ సామెత. కొన్ని కొన్ని వీడియోలను చూస్తుంటే అది కచ్చితంగా నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమేరాలో ఈ వీడియో రికార్డు అయింది (Woman escaped from an accident).
@gharkekalesh అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. భారీ వర్షాలు పడుతుండడంతో ఓ వీధి అంతా నీటితో నిండిపోయింది. ఇళ్లు, గోడలు బాగా నానిపోయాయి. అలాంటి వీధిలో ఓ మహిళ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తోంది. తన ఇంటి ముందు ఆగి గేటు తీసుకుని లోపలికి వెళ్లింది. గేటు మూసేసింది. మరుక్షణమే ఆమె ఇంటి ముందు గోడ కుప్పకూలిపోయింది. సరిగ్గా ఆమె నిల్చున్న చోటే ఆ భారీ గోడ పడింది. ఆమె అక్కడే ఉండుంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేది. ఆ ఘటన ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 95 వేల మంది వీక్షించారు. రెండు వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆమె నిజంగా అదృష్టవంతురాలు అని ఒకరు కామెంట్ చేశారు. ఆమె మరణం నుంచి త్రుటిలో తప్పించుకుంది అని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 27 , 2025 | 08:57 PM