Cat and Pigeon fight: ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:21 PM
పిల్లికి పావురం దొరికిందంటే పండగే. దానిని చంపేవరకు పిల్లి ఊరుకోదు. ఇంట్లో పక్షులను పెంచుకునే వారు పిల్లుల నుంచి వాటిని కాపాడేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు.
సాధారణంగా పావురాలు (Pigoen) ఏ ఇతర జంతువు జోలికీ వెళ్లవు. ముఖ్యంగా పిల్లుల (Cat) జోలికి అసలు వెళ్లవు. పావురం దొరికిందంటే పిల్లికి పండగే. దానిని చంపేవరకు పిల్లి ఊరుకోదు. ఇంట్లో పక్షులను పెంచుకునే వారు పిల్లుల నుంచి వాటిని కాపాడేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. ఎందుకంటే ఆ వీడియోలో ఓ పావురం పిల్లికే చుక్కలు చూపించింది. పిల్లి, పావురం మధ్య జరిగిన ఆ ఫైట్‌లో ఎవరు గెలిచారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే (Cat and Pigeon fight).
rtalwar1962 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పిల్లితో పావురం పోరాటానికి దిగింది. తన ముక్కుతో పిల్లి తలపై పొడిచింది. దీంతో పిల్లికి కోపం వచ్చి ఆ పావురం తలను పట్టుకుంది. తన గోళ్లతో పావురం శరీరంపై దాడికి దిగింది. పావురం కూడా తన శక్తినంతా ఉపయోగించి పోరాడింది. ఇద్దరి మధ్య కాసేపు భీకర పోరాటం జరిగింది. చివరకు పిల్లి అక్కడి నుంచి పారిపోయింది. పావురం ఆ పిల్లిని వెంబడించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 55 లక్షల మందికి పైగా వీక్షించారు. మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. పావురాలు ఇంత దూకుడుగా ఉంటాయని తనకు తెలియదంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశారు. దేవుడి దయ వల్ల రెండింటికీ ఏమీ జరగలేదని మరొకరు పేర్కొన్నారు. ఆ పిల్లి పిల్ల పావురంతో పోరాడలేకపోయిందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..
వామ్మో.. ఇది ప్రమాదకరమైన డ్యాన్స్.. వేదికపై వరుడి డ్యాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..