ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

HairBall Incident News: ఓరి నాయినో.. ఈ అమ్మాయి కడుపులో వెంటుక్రలు, రాళ్ల ముక్కలు.. అంతేకాకుండా..

ABN, Publish Date - Jun 02 , 2025 | 11:23 AM

ఓ బాలిక విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది. తనను పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే..

Hair Ball Incident

ఉత్తరప్రదేశ్‌: పిల్లలకు చిన్న వయసులో వింత అలవాట్లు ఉండటం సహజం. కొందరికి మట్టి తినడం, బియ్యం తినడం, మరికొందరికి రాళ్లు లేదా బలపాలు తినడం అలవాటై ఉంటుంది. అయితే, ఓ బాలికకు ఉండే అలవాటు మాత్రం చాలా విచిత్రమైనది. కొన్నేళ్ల పాటు తన జుట్టును తానే పీక్కొని తింటూ ఉండేది. అయితే, ఈ అలవాటు చివరికి పెద్ద సమస్యగా మారడంతో బాలిక ఆసుపత్రి పాలైంది. అసలేం జరిగిందంటే..


210 సెంటీమీటర్ల పొడవున్న వెంట్రుకలు..

ఆగ్రా జిల్లా బరారా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోంది. అయితే, తనకు విపరీతమైన కడుపు నొప్పి, వాంతలు వస్తున్నాయని జిల్లాలోని SMS హాస్పిటల్‌‌కు తరలించారు. నెల రోజులకు పైగా కడుపు నొప్పి, వాంతులు వస్తున్నాయని బాలిక కుటుంబ సభ్యులు చెప్పడంతో SMS ఆసుపత్రి వైద్యులు బాలకకు వైద్య పరీక్షలు చేయించారు. అయితే, పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

బాలిక కడుపులో ఏకంగా 210 సెంటీమీటర్ల పొడవున్న హెయిర్‌బాల్‌ను SMS హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స ద్వారా 210 సెంటీమీటర్ల పొడవున్న ట్రైకోబెజోవర్‌ ( వెంట్రుకలు)ను తొలగించారు. ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు నమోదైన అతి పొడవైన ట్రైకోబెజోవర్ అని వైద్యులు అంటున్నారు. ఆ బాలికకు పికా అనే మానసిక వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. అంటే ఈ వ్యాధిలో తినకూడని పదార్థాలు కూడా తింటారు.

కడుపులో ఆహారేతర వస్తువులు

బాలిక తన పాఠశాలలో 6వ తరగతి నుండి సుద్దను తింటూ ఉండేదని, తరువాత ఆమె వెంట్రుకలు తినడం మొదలుపెట్టిందని వైద్యులు తెలుసుకున్నారు. బాలికకు ఆపరేషన్ చేయగా చెక్క ముక్కలు, రబ్బరు బ్యాండ్లు, రాళ్ల ముక్కలు, దారాలతోపాటు ఇతర ఆహారేతర వస్తువులను గుర్తించారు. ట్రైకోబెజోవర్ చిన్న ప్రేగు అంతటా చిక్కుకుపోవడంతో శస్త్రచికిత్స ఒక సవాలుతో కూడుకున్న పనిగా మారిందని సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ జీవన్ కంకారియా తెలిపారు. ఎందుకంటే, దానిని ఒకే ముక్కగా తొలగించడం ఒక పెద్ద సవాలని, దానిని విచ్ఛిన్నం చేయడానికి ప్రేగులలో ఎక్కువగా కోతలు చేయాల్సి వస్తుందని తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో ముఖ్యంగా, రక్త మార్పిడి అవసరం లేకపోవడంతో ట్రైకోబెజోవర్‌ను ఒకే ముక్కగా తొలగించామని వైద్యులు తెలిపారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్

ట్రైకోబెజోవర్‌ పొడవు 210 సెం.మీ.గా ఉందని, ఇప్పటివరకు ఇలాంటి ఘటన చూడలేదని అన్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైకోబెజోవర్‌ను కడుపు నుండి తొలగించడం ఇదే ఫస్ట్ అని తెలిపారు. దీని కోసం తాము గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేస్తామని శస్త్రచికిత్సలలో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లు సాధించిన కంకారియా అన్నారు. ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు నిర్ధారించారు. త్వరలోనే ఆ బాలకను డిశ్చార్జ్ చేస్తామన్నారు.


Also Read:

ఆఫీస్‌లో ఈ తప్పులు చేయకండి.. కెరీర్‌ నాశనం అవుతుంది..

ఇలాంటి కోడలు ఉంటే ఇల్లు నరకమే..

For More Viral News

Updated Date - Jun 02 , 2025 | 12:18 PM