X Ray: మరీ ఇంత నిర్లక్ష్యమా.. నేలపై పడుకోబెట్టి ఎక్స్‌రే తీస్తారా?..
ABN, Publish Date - Jun 29 , 2025 | 09:42 PM
X Ray: అతడ్ని పరీక్షించిన డాక్టర్ ఎక్స్‌రే చేయించుకోమని చెప్పాడు. అయితే, అక్కడ ఎక్స్‌రే తీసే సిబ్బంది లీవ్‌లో ఉన్నాడు. దీంతో డాక్టర్‌ను ఎక్స్‌రే తీయమని అడిగారు. ఆ డాక్టర్ ఇందుకు ఒప్పుకోలేదు.
ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఘోరంగా తయారైంది. అక్కడ పని చేసే వారు దారుణంగా వ్యవహరిస్తున్నారు. రోగులంటే కనీస కనికరం కూడా లేకుండా పోయింది. తాజాగా, గాయాలతో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తి పట్ల అక్కడి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నేలపై పడుకోబెట్టి ఎక్స్‌రే తీశారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, బిజ్‌నార్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిరాత్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఆఫీసులో ఉండగా అతడు ఓ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడ్ని కిరాత్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు.
అతడ్ని పరీక్షించిన డాక్టర్ ఎక్స్‌రే చేయించుకోమని చెప్పాడు. అయితే, అక్కడ ఎక్స్‌రే తీసే సిబ్బంది లీవ్‌లో ఉన్నాడు. దీంతో డాక్టర్‌ను ఎక్స్‌రే తీయమని అడిగారు. ఆ డాక్టర్ ఇందుకు ఒప్పుకోలేదు. పేషంట్‌తో పాటు వెళ్లిన వాళ్లు బలవంతం చేయటంతో అయిష్టంగానే ఎక్స్‌రే తీసే చోటుకు వచ్చాడు. అక్కడ కూడా ఆ డాక్టర్ నిర్లక్యంగానే వ్యవహరించాడు. పేషంట్‌కు దూరంగా నిలబడి ఎక్స్‌రే తీయించాడు. పేషంట్ స్ట్రెచర్‌పై ఉండగానే.. నేలపై పడుకోబెట్టి ఎక్స్‌రే తీయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు విచారణకు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
విలన్ గొప్ప మనసు.. సొంత ఖర్చులతో 101 మందికి కాశీ యాత్ర..
స్వేచ్ఛ కేసు.. పూర్ణ చందర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Updated Date - Jun 29 , 2025 | 09:46 PM