Anchor Swetcha Case: స్వేచ్ఛ కేసు.. పూర్ణ చందర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ABN , Publish Date - Jun 29 , 2025 | 08:30 PM
Anchor Swetcha Case: పూర్ణ చందర్ మాటలు నమ్మి స్వేచ్ఛ భర్తకు విడాకులు ఇచ్చింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత పలుమార్లు పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ అతడిని నిలదీసింది. అయితే, అతడు మాత్రం పెళ్లి ప్రస్తావనను దాట వేస్తూ వచ్చాడు.
యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో అరెస్టయిన ఆమె ప్రియుడు పూర్ణ చందర్‌ను పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. కోర్టు పూర్ణ చందర్‌కు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే పూర్ణ చందర్ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్‌మెంట్‌లో జోగినిపల్లి సంతోష్ రావు పేరు చెప్పినట్లు తెలుస్తోంది. తనకు సంబందించిన అన్ని విషయాలు సంతోష్ రావుకు తెలుసని పూర్ణ చందర్ చెప్పాడు. భర్తతో విడాకులు తీసుకోమని స్వేచ్ఛకు చెప్పింది కూడా అతడే.
పూర్ణ చందర్ మాటలు నమ్మి స్వేచ్ఛ భర్తకు విడాకులు ఇచ్చింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత పలుమార్లు పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ అతడిని నిలదీసింది. అయితే, అతడు మాత్రం పెళ్లి ప్రస్తావనను దాట వేస్తూ వచ్చాడు. ఇద్దరూ వారం రోజుల క్రితం అరుణాచలం వెళ్లారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ తిరిగి వచ్చారు. అరుణాచలం నుండి తిరిగి వస్తున్న సమయంలోనే పెళ్లి విషయంపై ఇద్దరి మధ్యా మరో సారి గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోనని పూర్ణ చందర్ తేల్చి చెప్పాడు. నన్నేం చేయలేవు.. నాకు రాజకీయ అండ దండలు ఉన్నాయని అతడు బెదిరించాడు. స్వేచ్ఛతో తాను రిలేషన్లో ఉన్న విషయం కూడా సంతోష్ రావుకు తెలుసని పూర్ణ చందర్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి
టెస్లాతో మామూలుగా ఉండదు.. ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తాయి..
సిక్స్ కొట్టి పిచ్‌లోనే ప్రాణాలు వదిలిన ఆటగాడు