ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కథలో ట్విస్టులు.. అందుకే కూతురికి కాబోయే భర్తతో జంప్..

ABN, Publish Date - Apr 17 , 2025 | 08:43 AM

ఉత్తర ప్రదేశ్, అలీఘర్‌కు చెందిన ఓ మహిళ తన కూతురికి కాబోయే భర్తతో ఇంటినుంచి పారిపోయిన సంఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. స్వప్న,రాహుల్ పోలీసుల ఎదుటకు వచ్చారు. ఎందుకు లేచిపోయారో చెప్పారు.

UP Woman

లక్నో: ఉత్తర ప్రదేశ్, అలీఘర్‌కు చెందిన ఓ మహిళ తన కూతురికి కాబోయే భర్తతో ఇంటినుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్వప్న అనే మహిళ కాబోయే అల్లుడు రాహుల్ కుమార్‌తో వెళ్లిపోయింది. పెళ్లికి కేవలం పది రోజుల ముందర ఇలా జరగటంతో రెండు కుటుంబాల వారు షాక్ అయిపోయారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం స్వప్న, రాహుల్ పోలీసుల దగ్గర సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ కాబోయే అల్లుడితో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో చెప్పింది.


‘ నా భర్త బాగా తాగేవాడు. తాగి వచ్చి నన్ను బాగా కొట్టేవాడు. నా కూతురు కూడా నాతో తరచుగా గొడవలు పడేది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. ఏం జరిగినా నేను రాహుల్‌తోటే బతుకుతాను. నేను అతడ్నే పెళ్లి చేసుకుంటా.. అతడితోటే ఉంటా. నా కుటుంబం అంటున్నట్లు నేను 4 లక్షల డబ్బులు.. 5 లక్షలు విలువచేసే బంగారం తీసుకెళ్లలేదు. నా సెల్ ఫోన్.. ఓ 200 రూపాయలు మాత్రమే తీసుకెళ్లాను’ అని అంది. ఇక,రాహుల్ మాట్లాడుతూ.. ‘ నేను అలీఘర్ బస్టాండ్‌కు రాకపోతే ప్రాణాలు తీసుకుంటా అని స్వప్న బెదిరించింది. అందుకే నేను వెళ్లాను. మొదట మేమిద్దరం లక్నోకు వెళ్లాం.


అక్కడినుంచి ముజఫర్‌నగర్‌కు వెళ్లాము. మా గురించి పోలీసులు వెతుకుతున్నారని తెలిసింది. అందుకే వెనక్కు వచ్చేశాం. స్వప్నను భర్త, అత్తింటి వారు వేధించేవారు’ అని చెప్పాడు. అతడ్ని పెళ్లి గురించి అడగ్గా.. ‘ అలాంటి దేమీ లేదు’ అని మొదట అన్నాడు. కొద్ది సేపు ఆలోచించిన తర్వాత ‘ చేసుకుంటాను’ అని అన్నాడు. స్వప్న సోదరుడు ఆమెపై కోపంగా ఉన్నాడు. ఇంట్లోకి తిరిగి రానిచ్చేది లేదని తేల్చి చెప్పాడు. తీసుకెళ్లిన డబ్బు, నగలు తిరిగి ఇచ్చే వరకు ఊరుకోమన్నాడు. స్వప్నను తన బావ కొట్టేవాడన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నాడు. ఇక, పోలీసులు మాత్రం ఇంకా ఈ కేసుపై స్పందించలేదు.


ఇవి కూడా చదవండి

Viral Video: ఛీ నువ్వసలు డాక్టర్‌వేనా.. ఇంత దారుణమా..

Actress Abhinaya: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన నటి అభినయ

Updated Date - Apr 17 , 2025 | 08:43 AM