ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Jugaad video: ఇలాంటి తెలివి ఐఐటీ చదువుకున్న వాళ్లకూ ఉండదేమో.. వాటర్ క్యాన్ ఎలా పెట్టాడో చూడండి..

ABN, Publish Date - Mar 17 , 2025 | 06:18 PM

పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికే తెలివితేటలు ఉంటాయనుకుంటే అంత కంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. అసలు స్కూల్‌కే వెళ్లని వారు కూడా ఒక్కోసారి అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. తమ జ్ఞానంతో పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు.

viral jugaad

తెలివి తేటలు ఎవరి సొంతమూ కాదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికే తెలివితేటలు ఉంటాయనుకుంటే అంత కంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. అసలు స్కూల్‌కే వెళ్లని వారు కూడా ఒక్కోసారి అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. తమ జ్ఞానంతో పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది (Viral Video).


vishal1988soni అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి వాటర్ క్యాన్ (Water Can) సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. సాధారణంగా వాటర్ క్యాన్‌ను కింద డిస్పెన్షర్‌కు అమరుస్తారు. దానికి ఉన్న ట్యాప్ నుంచి నీళ్లు బయటకు వస్తాయి. అయితే ఆ వాటర్ డిన్సెన్షనర్ లేకపోవడంతో ఓ వ్యక్తి వెదురు బొంగును (Bamboo) డిన్సెన్షనర్‌గా మార్చేశాడు. ఆ వెదురు బొంగుకు ట్యాప్‌ను అమర్చాడు. ఆ ట్యాప్ తిప్పగానే వెదురు బొంగులో నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి.


బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలా వెదురు బొంగుతో ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.36 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి ప్రశంసించారు. బీహార్ వాళ్ల తెలివితేటల ముందు ఐఐటీ చదువుకున్న వారు కూడా పనికి రారని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ హెచ్‌డీ కళ్లకు అసలైన సవాల్.. తోటలో దాక్కున్న కప్పను 5 సెకెన్లలో కనుక్కోండి..


Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 06:18 PM