Share News

Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..

ABN , Publish Date - Mar 17 , 2025 | 03:12 PM

జింకలు, కుందేళ్లు, నక్కలు వంటి జంతువులే కాదు.. సింహాలు, పులులు వంటి క్రూర మృగాలు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగానే ఉంటాయి. ఒక్కోసారి పిల్లలు చేసే చిలిపి పనులకు కూడా భయపడుతుంటాయి. తాజాగా రెండు సింహాలు ఎంతలా ఉలిక్కిపడ్డాయో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
Lion cub scares parents

అడవి జంతువులు (Wild Animals) నిత్యం అప్రమత్తంగా ఉంటాయి. ప్రమాదం పొంచి ఉంటుందనే సృహతోనే అనుక్షణం జాగ్రత్త పడతాయి. జింకలు, కుందేళ్లు, నక్కలు వంటి జంతువులే కాదు.. సింహాలు, పులులు వంటి క్రూర మృగాలు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగానే ఉంటాయి. ఒక్కోసారి పిల్లలు చేసే చిలిపి పనులకు కూడా భయపడుతుంటాయి. తాజాగా రెండు సింహాలు (Lions) ఎంతలా ఉలిక్కిపడ్డాయో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. పిల్ల సింహం (Lioon Cubs) చేసిన చిలిపి పనికి అంతటి మృగరాజులు కూడా ఒక్కసారిగా భయపడ్డాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది (Lion Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొందరు టూరిస్ట్‌లు జంగిల్ సఫారీకి వెళ్లారు. మార్గమధ్యంలో వారికి రెండు సింహాలు కనిపించాయి. ఆ రెండూ ఇసుకలో నిద్రపోతున్నాయి. కొంత దూరం నుంచి ఓ పిల్ల సింహం వాటి దగ్గరకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లింది. అలా చప్పుడు లేకుండా వెళ్లి నిద్రపోతున్న ఒక సింహాన్ని టచ్ చేసింది. అంతే.. రెండు సింహాలు ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాయి. దాడి చేయడానికి సిద్ధపడ్డాయి. అయితే పిల్ల సింహాన్ని చూసి శాంతించాయి.


ఆ ఘటనను జంగిల్ సఫారీ టూరిస్ట్‌లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 15 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 27 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ రెండు సింహాలు ఎంతలా భయపడ్డాయో అని ఒకరు కామెంట్ చేశారు. ఆ సింహం పిల్ల చేసిన పని చాలా నవ్వు తెప్పిస్తోందని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Zomato delivery boy: కస్టమర్ ఫుడ్ తినేస్తున్న డెలివరీ బాయ్.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..


Jugaad Video: ఈ బోరు ఇలా ఉందేంటబ్బా.. నీరు బయటకు ఎలా వస్తోందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


Optical Illusion Test: ఈ గదిలో స్పైడర్‌ను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లు షార్ప్ అని తెలుసుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 03:12 PM