Shocking Truth About OM : ఓం అని జపిస్తే ఏమవుతుంది.. ? పరిశోధనలో విస్తుపోయే నిజాలు..
ABN, Publish Date - Feb 18 , 2025 | 06:30 PM
OM Mantra Effect : ఓంకారం సృష్టిలోనే మొదటి శబ్దం. దీనిని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. హిందూ మతం సంప్రదాయం ప్రకారం మంత్రంలో ప్రతి పదానికి ముందు ఓం ఉంటుంది. బౌద్ధులు, జైనులకు కూడా ఓం అనేది పవిత్ర చిహ్నం. కానీ, ఓ న్యూరాలజిస్ట్ ఇంకోలా ఆలోచించింది. అది రుజువు చేసేందుకు ఒక ప్రయోగం చేసింది. అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. అవేంటంటే..
OM Mantra Effect On Heart : సృష్టిలో మొదట పుట్టిన శబ్దం ఓంకారమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఓం అంటే బ్రహ్మ అని భావిస్తారు. ఓం అంటే నిత్యమైనది, సత్యమైనది, మార్పులేనిది, నాశనం లేనిదని అర్థం. అష్టోత్తరం, సంధ్యావందనం, సహస్రనామాలు ఇలా అన్నింటిలో ప్రతి పదానికి ముందు ఓం ఉంటుంది. బౌద్ధులు, జైనులకు కూడా ఓం అనేది పవిత్ర చిహ్నం. కానీ, కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి వేరే నమ్మకం ఉంది. ఓంకారాన్ని, మంత్రాలను జపించడం వల్ల శరీరంలో అసాధారణ మార్పులు ఏర్పడతాయని భావించి ఓ న్యూరాలజిస్ట్ ప్రయోగం చేసి చూసింది. దాని ఫలితాలు మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరచవచ్చు.
హృదయంపై మంత్రాల ప్రభావం..
ప్రాణాయామం, మంత్రాల జపం ద్వారా ఒత్తిడిని తగ్గుతుందని అంటారు. ఇదే విధంగా ఓం జపించడం వల్ల హృదయ స్పందన రేటు (HRV)లో కలిగే మార్పులను పరిశీలించి ఆసక్తికర విషయాలు కనుగొన్నారు న్యూరాలజిస్టు శ్వేత. ఓంకారానికి మన శరీరంలోని అనేక సమస్యలు నయం చేసే సామర్థ్యం ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు ప్రయోగం నిర్వహించారు. ఓం అనేది మతానికి సంబంధించిన విషయం కాదని ఇది యూనివర్సల్ మంత్ర అని ఈ పరిశోధకురాలు తేల్చారు.
హృదయ స్పందన రేటు ఎలా మారిందంటే..
శ్వేత అనే ఒక డాక్టర్ వేలికి పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని ఓంని రెండు విధాలుగా ఉచ్చరించింది. మొదటగా ఓ.. అంటూ చాలా సేపు సాగదీస్తూ పలకగా ఆక్సిమీటర్‌లో ఆమె పల్స్ రేటు 73కు చేరుకుంది. తర్వాత మ్.. అంటూ చాలాసేపూ అలాగే సాగదీస్తూ పలికింది. అప్పుడు ఆమె హృదయస్పందన రేటు 69కి తగ్గింది.
పడుకునే ముందు ఇలా ఉచ్చరించండి..
ఎవరైనా మెదడును ఉత్తేజపరచాలనుకుంటే ఓం అక్షరంలో 'ఓం' అక్షరాన్ని ఎక్కువసేపు ఉచ్చరించాలని డా.శ్వేత అంటోంది. రిలాక్స్ గా ఉండాలనుకుంటే 'M' శబ్దాన్ని ఎక్కువసేపు ఉచ్చరించాలని.. ఉదయం నిద్రలేచిన తర్వాత ఎక్కువసేపు ఓ జపించాలని అంటోంది.
గుండెను ఆరోగ్యంగా ఉండేందుకు 'ఓం'..
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. మనస్సు రిలాక్స్‌గా ఉండటానికి 'ఓం' ఎంతో ఉపయోగపడుతుంది. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు, హృదయ స్పందన ఎక్కువగా పెరగకుండా ఉండేందుకు 'ఓం' జపిస్తే మంచిదని డా.శ్వేత సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి..
పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. తూటా తగిలి బాలుడి దుర్మరణం
సైబర్ మోసానికి గురైతే మీ డబ్బును ఎలా తిరిగి పొందాలి
నా పాపాలే కాదు.. నా మొబైల్ పాపాలు కూడా పోవాలి.. కుంభమేళాలో ఓ కుర్రాడు ఏం చేశాడంటే..
మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 18 , 2025 | 06:36 PM