Noida: పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. తూటా తగిలి బాలుడి దుర్మరణం
ABN , Publish Date - Feb 18 , 2025 | 03:43 PM
పెళ్లి ఊరేగింపులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గాల్లో కాల్పులు రెండో అంతస్తులోని బాలుడికి తూటా తగిలి దుర్మరణం చెందాడు. నోయిడాలో ఈ దుర్ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలోని నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో గాల్లోకి కాల్పులు జరపడంతో తూటా తగిలి 2 ఏళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. సెక్టర్ 49లోని ఆఘాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది.
రాత్రి 9 గంటల సమయంలో బాలుడు ఉంటున్న భవనం ముందు నుంచి పెళ్లి ఊరేగింపు వెళ్లింది. ఈ ఊరేగింపును చూసేందుకు అందరూ తన ఇంటి టెర్రస్‌పైకి ఎక్కి వీక్షించసాగారు (Uttarpradesh).
Jhansi: అమ్మను నాన్నే చంపాడు..బొమ్మ వేసి మరీ చెప్పిన నాలుగేళ్ల చిన్నారి!
రెండో అంతస్తులో ఉంటున్న ఆ బాలుడిని తీసుకుని తండ్రి కూడా బాల్కనీలోకి వచ్చాడు. తండ్రి ఒళ్లో కూర్చుని చిన్నారి ఊరేగింపును వీక్షిస్తుండగా వారిలో ఒకరు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో తూటా బాలుడి తలలోకి దూసుకుపోవడంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు.
Groom Returns Dowry: వరుడికి రూ.5.51 లక్షల కట్నం! ఆ మరుక్షణం అతడు చేసింది చూసి..
ఘటనపై స్థానిక పోలీసు అధికారి అనుజ్ కుమార్ శైనీ స్పందిస్తూ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై భారత న్యాయసంహిత చట్టంలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాని తెలిపారు. బాధిత కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నుంచి వచ్చింది. నోయిడాలోని అద్దె ఇంట్లో ఉంటున్న వారికి చిన్నారి ఒక్కడే సంతానమని తెలిసింది.దీంతో, ఆ కుటుంబం శోక సంద్రంలో కూరుకుపోయింది.