ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Memory: భవిష్యత్‌ను నిర్ణయించేది జ్ఞాపకాలే.. సైంటిస్టులు చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటంటే..

ABN, Publish Date - Jun 24 , 2025 | 10:26 AM

Memory Psycology: ప్రతి మనిషీ రోజూ తను చేసే ప్రతి పని, ఎదురయ్యే సంఘటనలు అన్నింటినీ గుర్తుపెట్టుకోలేడు. కొన్నింటిని మాత్రమే గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంటుంది. కానీ, మెదడు మర్చిపోయిన జ్ఞాపకాలు సైతం మన భవిష్యత్ జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటే నమ్మగలరా? తాజా పరిశోధనలో వెల్లడైన ఆశ్చర్యకర ఫలితాల ప్రకారం..

Forgotten Memories Impact On Daily Life

Forgotten Memories Impact On Daily Life: పుట్టినప్పటి నుంచి జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవడం ఏ మనిషికీ సాధ్యం కాదు. అంతెందుకూ.. నిన్న ఏమేం చేశామని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే.. కచ్చితంగా చేసిన పనులూ, మాట్లాడిన మాటల్లో సగం గుర్తుండవు. ఎందుకంటే, మానవుని మెదడుకు మరుపు అనేది సహజ లక్షణం. కొత్త జ్ఞాపకాలు పోగుచేసుకుంటూ కాలంతో పాటు నడిచే కొద్దీ పాత జ్ఞాపకాలు మనసు లోలోతుల్లో మరుగున పడిపోతుంటాయి. కొన్నింటిని మాత్రం మనం కావాలనే మర్చిపోయేందుకు ప్రయత్నిస్తాం. కొందరు వ్యక్తులను, గతంలో ఎదురైన చేదు సంఘటనలను మర్చిపోగలిగితే జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టవచ్చని భావిస్తుంటాం. కానీ, ఇది పూర్తిగా నిజం కాదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మన భవిష్యత్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించేవి మర్చిపోయిన, మెదడు మూలల్లో దాగున్న జ్ఞాపకాలేనని తేలింది.

2025లో నేచర్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం, మనం ఏదైనా పాత విషయాన్ని గుర్తుంచుకోలేకపోయినా.. అది మన దైనందిన నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తేల్చారు. యేల్ విశ్వవిద్యాలయ న్యూరో సైంటిస్ట్ నిక్ టర్క్-బ్రౌన్ ఈ పరిశోధన గురించి మాట్లాడుతూ.. మనం రోజంతా పాత జ్ఞాపకాలలో మునిగిపోము. కానీ మన మెదడు దాదాపు 95% గత జ్ఞాపకాలను ఎక్కడో ఒకచోట అణిచేస్తుంది. ఇలాంటి జ్ఞాపకాలు మనకు తెలియకుండానే చేసే ప్రతి పనిని ప్రభావితం చేస్తాయి. చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం, స్కూలు, స్నేహితులు, తల్లిదండ్రులు, పెద్దయ్యాక ఆఫీసులో సహోద్యోగులు, జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు.. ఇలా ప్రతి జ్ఞాపకం మన వ్యక్తిత్వాన్ని, ఇవాళ చేసే పనిని నిర్దేశిస్తాయి.

ఎలా ఈ విషయం చెప్పగలిగారు?

కొంతమంది పరిశోధకులు FMRI స్కాన్ల సహాయంతో 60 మంది మెదడు పనితీరును అధ్యయనం చేశారు. ఈ వ్యక్తులకు కొన్ని చిత్రాలు, పదాలు చూపించారు. చాలామంది వాటిని కొన్ని రోజుల తర్వాత మర్చిపోయారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయా వ్యక్తులను కొన్ని నిర్ణయాలు తీసుకోమని అడిగినప్పుడు.. మరచిపోయిన జ్ఞాపకాల ప్రభావం వారి మనస్సులలో స్పష్టంగా కనిపించింది. ఈ జ్ఞాపకాలు అన్ని సమయాలలో గుర్తుంచుకోకపోయినా.. అవి మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని ఈ విధంగా రుజువైంది.

మర్చిపోయిన జ్ఞాపకాలకు, భవిష్యత్తుకు సంబంధమేంటి ?

ఉదాహరణకు మనం రోజువారీ జీవితం గురించి మాట్లాడుకంటే, మీరు ఏదైనా కొనడానికి ఒక దుకాణానికి వెళ్ళారని అనుకుందాం. అక్కడ ఒక ప్రత్యేకమైన వస్తువు మీ దృష్టిని ఆకర్షించింది. మీరు దానిని కొన్నారు. అలాంటి సందర్భంలో, మీరు తీసుకున్న నిర్ణయం ఏదైనా మరచిపోయిన జ్ఞాపకాలతో ముడిపడి ఉండవచ్చు. మీరు మీ బాల్యంలో ఆ వస్తువును తిని ఉండవచ్చు లేదా దానిని చూసిన తర్వాత తినాలని అనిపించి ఉండవచ్చు.

మెదడు పరిష్కారం కాని ఒక క్లిష్టమైన పజిల్‌. దీన్ని అర్థం చేసుకునేందుకు చేస్తున్న పరిశోధనల్లో ఈ అధ్యయనం ఒక మైలురాయి అని మనస్తత్వవేత్త డాక్టర్ ఎం. పిల్నియా అంటున్నారు. ఈ పరిశోధన మనిషి ప్రవర్తనను లోతుగా అర్థం చేసుకోవడానికి బాగా సహాయపడుతుంది. మెదడులోని ఏదో ఒక మూలలో జ్ఞాపకాల రూపంలో స్థిరపడే విషయాలు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. విద్య, మార్కెటింగ్ సహా అనేక రంగాలలో ఈ ఆవిష్కరణ అనూహ్య మార్పులు తీసుకురాగలదని పరిశోధకులు భావిస్తున్నారు. తద్వారా, కస్టమర్ల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం మార్కెట్ నిపుణులకు మరింత సులువవుతుంది. దీని గురించి ఇంకా పెద్ద ఎత్తున పరిశోధనలు చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నరు.

ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఆ కోబ్రా ఎలా నిల్చుందో చూశారా.. వీడియో చూస్తే షాకవడం ఖాయం..

తమిళ హీరో శ్రీకాంత్ అరెస్ట్
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 24 , 2025 | 01:28 PM