Share News

King Cobra: వామ్మో.. ఆ కోబ్రా ఎలా నిల్చుందో చూశారా.. వీడియో చూస్తే షాకవడం ఖాయం..

ABN , Publish Date - Jun 23 , 2025 | 05:06 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో వన్య మృగాలు, పాములకు సంబంధించిన వీడియోలు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

King Cobra: వామ్మో.. ఆ కోబ్రా ఎలా నిల్చుందో చూశారా.. వీడియో చూస్తే షాకవడం ఖాయం..
20 feet King Cobra standing up like human

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో వన్య మృగాలు, పాములకు సంబంధించిన వీడియోలు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ కింగ్ కోబ్రా (King Cobra)కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తాజా వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోను షేర్ చేసిన సుశాంత నంద చాలా భయకరంగా ఉందని కామెంట్ చేశారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న కింగ్ కోబ్రా ఏకంగా 20 అడుగులకు పైగా పొడవు ఉంది. అంతేకాదు అది నిటారుగా లేచి నిల్చుంది. ఆ కోబ్రాను చూసి చాలా మంది భయపడుతున్నారు. అటవీ అధికారులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు.


ప్రపంచంలోనే అన్ని పాములకంటే చాలా పొడవైనది (Longest Snake) పెద్దది కింగ్‌కోబ్రా అంటుంటారు. ఇప్పటివరకు 10 నుంచి 12 అడుగుల పొడవు మాత్రమే ఉండే కింగ్ కోబ్రాలను చూసి ఉంటాం. అయితే తాజాగా కోబ్రా ఏకంగా 20 అడుగులకు పైగా పొడవు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా కొన్ని లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. కొన్ని వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

ఒక్క రోజూ పని చేయకపోయినా రూ.26 లక్షల జీతం.. అబుధాబి కంపెనీకి కోర్టులో షాక్..

మొసలితో పెట్టుకునే ముందు ఆలోచించాల్సిందే.. వీడియో కోసం స్టంట్ చేయాలనుకుంటే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2025 | 05:06 PM