Elephant Video: వామ్మో.. ఏనుగుకు ఆకలి వేస్తే ఇలా ఉంటుందా? ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లి ఏం చేసిందంటే..
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:39 PM
అభివృద్ధి పేరుతో అడవులను కొట్టేయడం, రోడ్ల కోసం చెట్లు నరికివేయడం మొదలైన కారణాలతో వన్య ప్రాణాలు ఆహారం కోసం, అవాసం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
అభివృద్ధి పేరుతో అడవులను కొట్టేయడం, రోడ్ల కోసం చెట్లు నరికివేయడం మొదలైన కారణాలతో వన్య ప్రాణులు (Wild Animals) ఆహారం కోసం, అవాసం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లేదా సామాన్య జనాలకు హాని కలిగిస్తున్నాయి. తాజాగా థాయ్‌లాండ్ (Thailand)లో ఓ ఏనుగు (Elephant)కు ఆకలి వేసింది. దాంతో అది ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Thailand Elephant Store).
bangkokcommunityhelp అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. థాయిలాండ్‌లోని ఖావో యాయ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖావో యాయ్ నేషనల్ పార్క్‌లో నివసించే 23 ఏళ్ల అడవి ఏనుగు ఖావో యాయ్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించింది. అది నేరుగా తినుబండరాలు పెట్టి ఉన్న సెక్షన్ వైపు వెళ్లి తనకు కావాల్సినవి తీసుకుంది. ఆ భారీ ఏనుగు ఆ స్టోర్ టాప్‌నకు తగిలేంత పొడవుగా ఉంది. అది తిరిగి వెళ్తూ కొన్ని స్నాక్స్ ప్యాకెట్స్‌ను తీసుకుంది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల మంది వీక్షించారు. దాదాపు 70 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. థాయ్‌లాండ్‌లో ఇలాంటివి సాధారణమే అని కొందరు కామెంట్లు చేయడం విశేషం.
ఇవి కూడా చదవండి..
Tiger Jump Video: వావ్.. ఈ పులిని చూడండి.. ఎంత దూరం జంప్ చేసిందో.. వీడియో వైరల్
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..
మరిన్ని వైరల్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 05 , 2025 | 01:39 PM