Share News

Tiger Jump Video: వావ్.. ఈ పులిని చూడండి.. ఎంత దూరం జంప్ చేసిందో.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:23 PM

వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పులి చేసిన జంప్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు.

Tiger Jump Video: వావ్.. ఈ పులిని చూడండి.. ఎంత దూరం జంప్ చేసిందో.. వీడియో వైరల్
Tiger Jump Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పులి (Tiger) చేసిన జంప్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు (Tiger Jump Video).


IFS అధికారి @susantananda3 తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రాయల్ బెంగాల్ టైగర్ ఓ కాలువ ఒడ్డుకు వచ్చి నిలబడింది. అకస్మాత్తుగా అవతల ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డుకు దూకేసింది. దాదాపు 30 అడుగుల దూరాన్ని ఆ పులి సునాయాసంగా దూకేసింది. ఆ ఘటనను కెమెరాలో బంధించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. సుందర్బన్ అడవులు రాయల్ బెంగాల్ టైగర్ల సహజ నివాస స్థలం. ఈ ప్రాంతం దట్టమైన మడ అడవులకు ప్రసిద్ధి.


కాగా, పులి జంప్‌నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని వేల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఆ పులి తన సహజ శక్తిలో కేవలం 50 శాతం మాత్రమే ఉపయోగించి ఆ జంప్‌ను పూర్తి చేసినట్టు అనిపిస్తోందని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. పులులు శక్తివంతమైనవి మాత్రమే కాదు, తెలివైనవని కూడా ఈ వీడియో రుజువు చేస్తోందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 01:23 PM