Math Teacher: 2 మార్కులు తక్కువ వేసిందని టీచరమ్మపై దారుణం..
ABN, Publish Date - Aug 13 , 2025 | 08:13 AM
Math Teacher: ఓ విద్యార్థికి 20 మార్కుకు గాను 18 మార్కులు వచ్చాయి. ఆ మార్కులతో అతడు సంతృప్తి చెందలేదు. నేరుగా ఆర్టీ దగ్గరకు వెళ్లాడు. ఎందుకు ఆ రెండు మార్కులు వేయలేదని ఆమెను అడిగాడు.
2 మార్కులు తక్కువ వేసిందన్న కోపంతో ఓ యువకుడు టీచరమ్మపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై క్లాస్ రూములోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. 20 మార్కులకు గాను 18 మార్కులు తెచ్చుకున్నా కూడా ఆ యువకుడు సంతృప్తి చెందలేదు. రెండు మార్కుల కోసం లెక్కల టీచర్‌తో గొడవ పెట్టుకుని, ఆమెను కొట్టాడు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉతాయ్ థానీ ప్రాంతానికి చెందిన ఆర్టీ.. ఓ స్కూల్లో లెక్కల టీచర్‌గా పని చేస్తోంది.
ఆగస్టు 5వ తేదీన మిడ్ టర్మ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఫలితాలను ప్రకటించింది. ఓ విద్యార్థికి 20 మార్కుకు గాను 18 మార్కులు వచ్చాయి. ఆ మార్కులతో అతడు సంతృప్తి చెందలేదు. నేరుగా ఆర్టీ దగ్గరకు వెళ్లాడు. ఎందుకు ఆ రెండు మార్కులు వేయలేదని ఆమెను అడిగాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ విద్యార్థి ఆర్టీపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఇంతలో ఓ మగ టీచర్ అక్కడికి వచ్చాడు. దాడిని ఆపాడు. ఈ దాడిలో ఆర్టీ కళ్లు, తల, రిబ్స్‌కు గాయాలు అయ్యాయి.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూములో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆర్టీ ఆ సీసీటీవీ దృశ్యాల తాలూకా వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. ‘ఆ యువకుడిని వదిలిపెట్టను. చట్టపరంగా పోరాటం చేస్తాను. అత్యంత కఠినమైన చర్యలు తీసుకునేలా చేస్తాను’ అని అంది. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి సరైన విధంగా బుద్ధి చెప్పాలని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
కర్రీ పఫ్‌లో పాము.. షాక్ అయిన మహిళ..
కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. నీళ్లివ్వండి ప్లీజ్..
Updated Date - Aug 13 , 2025 | 09:05 AM