Pakistan Seeks Water: కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. నీళ్లివ్వండి ప్లీజ్..
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:56 AM
Pakistan Seeks Water: ఓ వైపు అయ్యా, బాబు అంటూనే మరో వైపు తన దుష్ట బుద్ధి చూపిస్తోంది పాక్. భారత్‌ను, భారతీయుల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయి. పాక్‌కు బుద్ధి చెప్పడానికి భారత్ సింధు జలాలను నిలిపివేసింది. ప్లీజ్ అని బతిమాలాల్సిందిపోయి పాక్ రెచ్చిపోయింది. దెబ్బకు దెబ్బతీస్తామన్నట్లు ప్రవర్తించింది. పాకిస్తాన్‌కు సింధు జలాలు నిలిచిపోయి దాదాపు 3 నెలలు అవుతోంది. ఈ మూడు నెలలుగా పాక్ ప్రజలు చుక్కలు చూస్తున్నారు. నీటి కష్టాలతో అల్లాడిపోతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లోనూ పాక్ నేతలు తమ పాడు బుద్ధి మార్చుకోలేదు.
తాజాగా, పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో, మిలటరీ చీఫ్ అసిమ్ మునిర్ భారత్‌పై బెదిరింపులకు దిగారు. ‘అణు బాంబు వేసి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామ్’ అంటూ అసిమ్ రెచ్చిపోయారు. సిందూ జలాలు ఇవ్వకపోతే ఇండియాపై న్యూక్లియర్ బాంబ్ దాడి చేస్తామన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న బుట్టో.. ‘నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వ చర్యలు పాక్‌కు చాలా నష్టం కలిగించాయి. ఈ చర్యలకు మనమంతా ఐకమత్యంగా ఎదురొడ్డి నిలవాలి’ అంటూ పాక్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. సోమవారం సింధు జలాలపై భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సింధు జలాల పంపిణీ ఒప్పందం ప్రకారం తమకు మళ్లీ నీటిని విడుదల చేయాలని కోరింది.
రాయబారులకు గ్యాస్, కరెంట్ కట్
ఓ వైపు అయ్యా, బాబు అంటూనే మరో వైపు తన దుష్ట బుద్ధి చూపిస్తోంది పాక్. భారత్‌ను, భారతీయుల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారత రాయబారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లోని రాయబారుల గృహాలకు గ్యాస్, కరెంట్ సరఫరాను ఆపివేసింది. గత జూన్ నెలలో భారత హైకమిషన్, రాయబారుల ఇళ్లకు పత్రికలను నిలిపివేసింది. ఇలా తరచుగా ఇబ్బందులు పెడుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
మూడేళ్లలో జరగాల్సిన పనులు 8 నెలల్లో పూర్తి